ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్‌ (వాట్సాప్)ను ఇప్పుడు మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్‌లో చాలా మంది సభ్యులు ఉంటారు. ఇందులో నిమిషానికి ఒక ఫోటో, వీడియో లేదా gif ఫైల్ వస్తూనే ఉంటుంది. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆటోమాటిక్ గా డౌన్‌లోడ్ అవుతుంది.. అలాగే మీ గ్యాలరీలోనూ సేవ్ అవుతుంది. అలా లెక్కలేనన్ని అనవసర ఫోటోస్, వీడియోస్ చాలా సేవ్ అవుతుంటాయి. దీనివల్ల ఫోన్ మెమరీ కూడా త్వరగా ఫుల్ అయి స్టోరేజీ సమస్య ఏర్పడుతుంది.

ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్‌ (వాట్సాప్)ను ఇప్పుడు మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. ఒక వాట్సాప్ గ్రూప్‌లో చాలా మంది సభ్యులు ఉంటారు. ఇందులో నిమిషానికి ఒక ఫోటో, వీడియో లేదా gif ఫైల్ వస్తూనే ఉంటుంది. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆటోమాటిక్ గా డౌన్‌లోడ్ అవుతుంది.. అలాగే మీ గ్యాలరీలోనూ సేవ్ అవుతుంది. అలా లెక్కలేనన్ని అనవసర ఫోటోస్, వీడియోస్ చాలా సేవ్ అవుతుంటాయి. దీనివల్ల ఫోన్ మెమరీ కూడా త్వరగా ఫుల్ అయి స్టోరేజీ సమస్య ఏర్పడుతుంది. అప్పుడు ఫోటోలు ఒక్కొక్కటిగా సెర్చ్ చేసి డిలీట్ చేయడం విసుగు కలిగించే పని. అయితే వాట్సాప్‌లో అనవసర ఫోటోలు, వీడియోస్ డౌన్‌లోడ్ కాకుండా ఉండేందుకు ఓ ట్రిక్ ఉంది. అదేంటో తెలుసుకుందామా.

ఆటో-డౌన్‌లోడ్ ఎంపికను ఆఫ్ చేయండి:-

WhatsAppలో ఏదైనా వీడియో, ఫోటో వస్తే అది ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేయబడి ఫోన్ గ్యాలరీలో సేవ్ చేయబడుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి వాట్సాప్ సెట్టింగ్‌లలోని స్టోరేజ్-డేటా లోకి వెళ్లి మీడియా ఆటో-డౌన్‌లోడ్ ఎంపికను ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఫోటో, వీడియో లేదా ఏదైనా ఫైల్స్ చూసి ఓపెన్ చేస్తేనే డౌన్‌లోడ్ అవుతుంది. ఫోటోలు, వీడియోలు మొబైల్‌లో ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి. ఈ సమస్యను నివారించడానికి, మొబైల్ ఫోన్‌లో ఫోటో, వీడియోను సేవ్ చేయడానికి బదులుగా దానిని క్లౌడ్ లో సేవ్ చేయవచ్చు.

అలాగే స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద సైజు పైల్స్‌ని సెర్చ్ చేసి తొలగించవచ్చు. అనవసరమైన పెద్ద సైజు ఫైల్‌లను తొలగించినప్పుడు ఎక్కువ స్పేస్ ఉంటుంది. 16జీబీ, 32జీబీ, 128జీబీ మెమరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను ఇప్పుడు చాలా మంది ఉపయోగిస్తున్నారు. 16GB, 32GB, 128GB మెమరీని ఫిల్ చేయడం కష్టమే. ఎందుకంటే ఎక్కువ స్టోరేజ్ ఫోన్‌లను స్లోగా చేస్తుంది. అదేవిధంగా ఫోన్‌లోని అప్లికేషన్‌లను ఓపెన్ చేయగానే.. అవి మొబైల్‌లో సేవ్ అవుతాయి. ఫోన్ సెట్టింగ్‌లలోని యాప్‌కి వెళ్లడం ద్వారా దీన్ని సులభంగా తీసివేయవచ్చు.

ఇకపై మొబైల్స్‌లోని కొన్ని అప్లికేషన్‌లను ఉపయోగించము. అయితే అది మన మొబైల్ లోనే ఉంటుంది. ఇటువంటి యాప్స్, ఫీచర్స్ స్టోరేజీ సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి ముందుగా అలాంటి అప్లికేషన్లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. దీని ద్వారా ఫోన్‌లో స్టోరేజీని మరింత స్పేస్ ఇవ్వచ్చు.

Updated On 23 Jun 2023 7:52 AM GMT
Ehatv

Ehatv

Next Story