సోషల్ మీడియా పుణ్యమా అంటూ మారుమూల ప్రాంతాల్లో యువత సైతం తమ ట్యాలెంట్ తో ముందుకు వస్తున్నారు. ఎవరి ప్రతిభను వాళ్ళు వీడియోస్,ఫొటోస్ తో సోషల్ మీడియాలో కనబరుస్తున్నారు. దానితో సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ లో ఉన్న ఫాలోవెర్స్ సంఖ్యను పెంచుకుంటూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా ఆడ ,మగ అనే తేడా లేకుండా అందరు తమ ట్యాలెంట్ ని కనబరుచుకొనేవిధంగా కూడా సోషల్ యాప్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి . కేవలం ఫొటోస్ ,వీడియోస్ కాదు […]

సోషల్ మీడియా పుణ్యమా అంటూ మారుమూల ప్రాంతాల్లో యువత సైతం తమ ట్యాలెంట్ తో ముందుకు వస్తున్నారు. ఎవరి ప్రతిభను వాళ్ళు వీడియోస్,ఫొటోస్ తో సోషల్ మీడియాలో కనబరుస్తున్నారు. దానితో సోషల్ మీడియా ప్లాటుఫార్మ్స్ లో ఉన్న ఫాలోవెర్స్ సంఖ్యను పెంచుకుంటూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా ఆడ ,మగ అనే తేడా లేకుండా అందరు తమ ట్యాలెంట్ ని కనబరుచుకొనేవిధంగా కూడా సోషల్ యాప్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి . కేవలం ఫొటోస్ ,వీడియోస్ కాదు మనం ఏమి చెప్పాలనుకున్న ,ఏమి పంచుకోవాలన్న ,ఏమి చూపించాలన్న సెకండల్లో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవచ్చు. ఆలా వైరల్ అయిన వీడియోలు చాలానే ఉన్నాయి . ఒక్కసారి మీరు పోస్ట్ చేసిన ఫోటో లేదా వీడియో వైరల్ అయ్యిందా ఒక్క రాత్రిలో మీరు స్టార్ అయిపోతారు. ఇలా అవ్వడానికే కాబోలు ఒక యువకుడు ఎవ్వరు ఊహించని పని చేసాడు. తాను పెట్టిన వీడియో తో వైరల్ అవుతాను అనుకోని ఏకంగా పోలీసుస్టేషన్ పాలయ్యాడు .

పిచ్చి పలు రకాలు అంటారు ఇది సరిగ్గా అలాంటిదే స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది .మెదడులో క్రియేటివిటీ బయటకు తీసాడు . కటకటాల పాలయ్యాడు .అత్తారింట్లో కొత్త అల్లుడు చేసిన ఈ పనికి ఊరంతా ముక్కున వేలువేసుకుంది. కాట్రేనికోన అనే గ్రామానికి చెందిన మల్లాది వీరబాబు అనే అతనికి బలుసుతిప్ప గ్రామానికి చెందిన అమ్మాయి తో ఫిబ్రవరి 8 న పెళ్లి జరిగింది. తన శోభనం రాత్రి అమ్మాయికి తెలియకుండా స్మార్ట్ ఫోన్ లో మొదటిరాత్రి తంతు మొత్తం వీడియో తీసాడు. తెల్లారి ఆ వీడియో ని వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు. ఆ వీడియో ని చాల మంది డౌన్లోడ్ చేసుకోవటం కూడా జరిగింది. చాల మంది వీడియో చూసి ఆనందించారు . ఊరంతా ఈ విషయం తెలిసింది . పెళ్ళికొడుకు అత్తగారు కి ఈ విషయం తెలిసేసరికి కాస్త ఆలస్యం జరిగి అమ్మాయి పరువు తీసాడంటూ పోలీసులకి ఫిర్యాదు చేయడం తో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా అతనికి 14 రోజుల రిమాండ్ కూడా విధించింది .

నాలుగు గోడల మధ్య జరగాల్సిన కాపురాన్ని నడిరోడ్డుకు తీసుకువచ్చిన వీడికి ఇదేమి పోయేకాలం! అంటూ ఊర్లో జనం తిడుతున్నారు . ఇది ఏదో రాష్ట్రములో ,ఎక్కడో మారుమూలో జరిగిన సంఘటన కాదు .మన తెలుగురాష్ట్రం లో కోనసీమ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం ప్రాంతంలో జరిగిన ఘటన కావటం విశేషం .

Updated On 4 March 2023 5:41 AM GMT
Ehatv

Ehatv

Next Story