ఓ డిఫరెంట్‌ స్పోర్ట్‌ ఈవెంట్‌ను చూడాలనుకుంటే మాత్రం ఫిన్లాండ్‌(Finland)కు వెళ్లండి. ప్రతి ఏడాది అక్కడో గమ్మత్తయిన పోటీ జరుగుతుంది.. పరుగు పందాల్లాగే ఫిన్లాండ్‌లో వైఫ్‌ క్యారియింగ్ పందాలు జరుగుతాయి.. ఈ ఆట గురించి సింపుల్‌గా చెప్పాలంటే భార్యను మోస్తూ పరుగెత్తడమన్నమాట! వినడానికే వింతగా ఉన్న ఈ ఆటను చూసి చాలా సేపు ఎంజాయ్‌ చేయొచ్చు.

ఓ డిఫరెంట్‌ స్పోర్ట్‌ ఈవెంట్‌ను చూడాలనుకుంటే మాత్రం ఫిన్లాండ్‌(Finland)కు వెళ్లండి. ప్రతి ఏడాది అక్కడో గమ్మత్తయిన పోటీ జరుగుతుంది.. పరుగు పందాల్లాగే ఫిన్లాండ్‌లో వైఫ్‌ క్యారియింగ్ పందాలు జరుగుతాయి.. ఈ ఆట గురించి సింపుల్‌గా చెప్పాలంటే భార్యను(wife) మోస్తూ పరుగెత్తడమన్నమాట! వినడానికే వింతగా ఉన్న ఈ ఆటను చూసి చాలా సేపు ఎంజాయ్‌ చేయొచ్చు. జూన్‌ 30న మొదలైన వైఫ్‌ క్యారియింగ్‌ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ పోటీలు(Carrying World Championships) జులై 1వ తేదీన ముగుస్తాయి. ప్రతి సంవత్సరం జులై మొదటి శనివారం ఫిన్లాండ్‌లోనే ఈ విచిత్రమైన పోటీ జరుగుతుంది. అదేమిటంటే భార్యలను భర్తలు మోయడం(Carrying Wife). అదేమిటీ భర్త అంటేనే భరించేవాడు కదా! మళ్లీ పోటీ ఎందుకన్న ప్రశ్న అనవసరం. ఉత్తినే మోయడం కాదు. మోస్తూ కాసేపు పరుగెత్తాలి. ఊరికే పరుగెడితే భార్యలూరుకోరు.పోటీలో గెలవాలి. ఈ పోటీలను వైఫ్‌ క్యారింగ్‌ ఛాంపియన్‌షిప్‌ అంటారు. పేరుకు వైఫ్‌ క్యారింగ్ పోటీలే కానీ కచ్చితంగా భార్యలనే మోసుకెళ్లాలనే రూలేమీ లేదు.. ఎందుకంటే పెళ్లి కాని ప్రసాద్‌లు కూడా ఉంటారుగా! భార్యలు లేని భర్తలూ ఉండవచ్చు. మరి అలాంటి వారికి కూడా ఛాన్స్‌ ఇవ్వాలిగా..! అందుకే 49 కిలోల కంటే ఎక్కువ బరువున్న ఏ అమ్మాయిని అయినా మోస్తూ పరుగెత్తవచ్చు..

అసలు నిర్వాహకులకు ఈ అవుడియా ఎలా వచ్చిందంటే, బ్రహ్మచారి శతమర్కట: అన్నట్టుగా ఫిన్లాండ్‌లో ఒకప్పుడు పెళ్లికాని యువకులు కంటికి కనిపించిన అమ్మాయిలను భుజానేసుకుని ఎత్తుకెళ్లి చక్కగా పెళ్లి చేసుకునేవారట! ఇది పాడు పద్దతే అయినప్పటికీ ఆ కాలంలో అలా చెల్లుబాటు అయ్యింది. అదే ఇప్పుడు భార్యలను మోసే పోటీగా మారిందంటారు అక్కడి పెద్ద మనుషులు. ఇందులో పాల్గొనే భర్తలకు బోలెడంత స్టామినా ఉండాలి. ఎంచేతంటే భార్యలను ఎత్తుకుని ఓ 253.5 మీటర్ల దూరం పరుగెత్తాలి. గెలవాలంటే ఫస్టున రావాలి.

మధ్యలో రెండు చోట్ల హర్డిల్స్‌ ఉంటాయి. ఓ చోట మీటరు లోతున్న నీటి గుంట ఉంటుంది.. భార్యను కిందపడేయకుండా ఈ అడ్డంకులన్నింటిని అధిగమించి పరుగెత్తాల్సి ఉంటుంది. జనరల్‌గా భార్యలను లేదా అమ్మాయిలను వీపు మీద వేసుకుని పరుగెత్తుతారు. కొందరేమో భుజం మీద వేసుకుని పరుగెత్తుతారు. చాలా మంది మాత్రం ఉపయోగించే టెక్నిక్‌ ఎస్టోనియన్‌. అంటే భార్యను కానీ అమ్మాయిని కాని తలకిందులుగా వీపు మీద వేసుకుని పరుగెత్తడం అన్నమాట! ఇలా అయితే ఈజీగా పరుగెత్తవచ్చు. ఇందులో విజేతలకు భార్య బరువంత బీరును కానుకగా ఇస్తారు. అంతేనా అంటే అంతకు అయిదురెట్లు క్యాష్‌ ఇస్తారు. ఈ పోటీలో పాల్గొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.. జులై వచ్చిందటే చాలు ..దేశ దేశాల నుంచి కపుల్స్‌ ఫిన్లాండ్‌కు చేరుకుంటున్నారు. ఈ పోటీలు బాగా పాపులర్‌ కావడంతో ఇతర దేశాల్లో కూడా భార్యలను మోసే భర్తల కాంపిటీషన్‌లను నిర్వహిస్తున్నారు. అమెరికాలోని మెయిన్‌లో అయితే ప్రతి ఏడాది అక్టోబర్‌ మాసంలో వైఫ్‌ క్యారింగ్‌ పోటీలు(Wife carrying competitions) జరుగుతున్నాయి. మన కేరళ(Kerala)లో కూడా ఇలాంటి పోటీలు జరుగుతున్నాయి..

Updated On 1 July 2023 2:44 AM GMT
Ehatv

Ehatv

Next Story