రోజురోజు వింత పోకడలకు నేటి సమాజం నెలవైంది. కాదేదీ విందుకు అనర్హమని కొందరు వింత విందులు ఏర్పాటు చేస్తున్నారు. జనరల్‌గా మనుషుల పుట్టినరోజుల(Birthday) వేడుకలు, పార్టీలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో తమ పెంపుడు కుక్కల(Pet dogs) పుట్టిన రోజులు, ఆ కుక్కలకు పిల్లలు పుడితే సెలబ్రేషన్స్ చేస్తున్నారు.. అంతే కాకుండా ఆవుల పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు. తాజాగా మరో ఇలాంటిదే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీలో(AP) ఓ కుటుంబం కోడి పుంజుకు(Kodi Punju) పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది.

రోజురోజు వింత పోకడలకు నేటి సమాజం నెలవైంది. కాదేదీ విందుకు అనర్హమని కొందరు వింత విందులు ఏర్పాటు చేస్తున్నారు. జనరల్‌గా మనుషుల పుట్టినరోజుల(Birthday) వేడుకలు, పార్టీలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో తమ పెంపుడు కుక్కల(Pet dogs) పుట్టిన రోజులు, ఆ కుక్కలకు పిల్లలు పుడితే సెలబ్రేషన్స్ చేస్తున్నారు.. అంతే కాకుండా ఆవుల పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు. తాజాగా మరో ఇలాంటిదే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీలో(AP) ఓ కుటుంబం కోడి పుంజుకు(Cock) పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించింది. అంతేకాదు 500 మందికి విందు భోజనం(Dinner) ఏర్పాటు చేశారు. తాజాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది..!

విశాఖ(Vishakapatnam) జిల్లాలో చీమలాపల్లిలో(Cheemalapalli) ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. దంపతులు కోటేశ్వరరావు(Koteshwar Rao), కవితకు(Kavitha) ఇద్దరు సంతానం. ఆరేళ్ల కిందట 5 రూపాయలు పెట్టి ఓ కోడిపిల్లను కొన్నారు. ఈ కోడిపుంజుకు చిక్కు(chikku) అని నామకరణం కూడా చేశారు. దానిని ప్రేమగా పెంచుకున్నారు. ఈ కుటుంబం ఎక్కిడకి వెళ్లినా ఆ కోడిపిల్లను తీసుకెళ్లేవారు. ఆరేళ్ల నుంచి అపురూపంగా దానిని పెంచారు. ఈ పుంజును ఏసీ గదిలో పడుకోబెడతారు. చిక్కు పేరుతో ఓ యూట్యూబ్‌ చానెల్‌(Youtube channel) ఓపెన్ చేసి దానికి సంబంధించిన పలు వీడియోలు పోస్టు చేస్తున్నారు. దీంతో ఈ కోడిపుంజు బర్త్‌ డేను ఈనెల 20న ఘనంగా నిర్వహించింది ఆ కుటుంబసభ్యులు. కోడి పుంజు జన్మదినం సందర్భంగా కేక్‌ కట్‌(Cake cutting) చేసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. సుమారు 500 మందికి చక్కని విందు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఈ విడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. కోడి బర్త్‌ డేపై పలువురు నెటిజన్లు పలురకాలు స్పందిస్తున్నారు. కొందరు ఫన్నీ కామెంట్స్‌ చేస్తే మరికొందరు పిచ్చి పరాకాష్టకు చెందిందని అంటున్నారు. కామెంట్స్‌ను పక్కన పెడితే ఈ ఘటన పలువురు నెటిజన్లకు వినోదాన్ని పంచి పెడుతోంది.

Updated On 24 Nov 2023 2:40 AM GMT
Ehatv

Ehatv

Next Story