చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు(Funeral) నిర్వహించడం కుటుంబసభ్యుల ధర్మం. దగ్గరవాళ్లు చనిపోయారన్న బాధను పంటికింద అదిమిపెట్టుకుని, తన్నుకొస్తున్న దుఃఖాన్ని అణచివేసుకుని అంత్యక్రియలు జరుపుతారు. కాసింత ఉన్నవారైతే సంస్మరణ కార్యక్రమాలు కూడా చేస్తారు. బ్రిటన్‌లో(Britain) కూడా కుటుంబసభ్యులు చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేశారు. సరిగ్గా మూడు వారాల తర్వాత కుటుంబసభ్యులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం తెలిసింది. కుటుంబాన్ని వెతుక్కుంటూ ఆసుపత్రి(Hospital) నుంచి వచ్చిన వ్యక్తి ఓ షాకింగ్‌ నిజం చెప్పాడు.

చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు(Funeral) నిర్వహించడం కుటుంబసభ్యుల ధర్మం. దగ్గరవాళ్లు చనిపోయారన్న బాధను పంటికింద అదిమిపెట్టుకుని, తన్నుకొస్తున్న దుఃఖాన్ని అణచివేసుకుని అంత్యక్రియలు జరుపుతారు. కాసింత ఉన్నవారైతే సంస్మరణ కార్యక్రమాలు కూడా చేస్తారు. బ్రిటన్‌లో(Britain) కూడా కుటుంబసభ్యులు చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేశారు. సరిగ్గా మూడు వారాల తర్వాత కుటుంబసభ్యులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం తెలిసింది. కుటుంబాన్ని వెతుక్కుంటూ ఆసుపత్రి(Hospital) నుంచి వచ్చిన వ్యక్తి ఓ షాకింగ్‌ నిజం చెప్పాడు. మీరు మూడు వారాల కిందట అంత్యక్రియలు చేసిన వ్యక్తి మీ కుటుంబసభ్యుడు కాదు. అతడి మృతదేహం(Dead Body) ఇంకా హాస్పిటల్‌లోనే ఉంది. త్వరగా వచ్చి తీసుకెళ్లండి అని చెప్పాడు. అతడి మాటలు విని కుటుంబసభ్యులు బిత్తరపోయారు. వెంటనే వెళ్లి డెడ్‌బాడీని తెచ్చుకుని మరోసారి అంత్యక్రియలు చేశారు. ఈ విచిత్ర సంఘటన బ్రిటన్‌లో జరిగింది. సౌత్‌ వేల్స్‌లోని(South Wales) క్వంబ్రాన్‌లో ది జార్జ్‌ యూనివర్సిటీ ఆసుపత్రి(The george University Hospital) ఉంది. నాలుగువారాల కిందట అందులో ఓ వ్యక్త చేరాడు.చికిత్స తీసుకుంటూ వారం రోజుల తర్వాత చనిపోయాడు. కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతదేహానికి సిర్హోయ్‌ వాలీ స్మశాన వాటికలో అంత్యక్రియలు కూడా నిర్వహించారు. నెమ్మదిగా బాధ నుంచి కోలుకుంటున్న సమయంలో జార్జ్‌ యూనివర్సిటీ ఆసుపత్రి సిబ్బంది ఓ బాంబు పేల్చారు. చిన్న పొరపాటు జరిగిందని, అనుకోకుండా వేరే వ్యక్తి మృతదేహాన్ని మీకు అప్పగించామని చెప్పారు. మీ కుటుంబసభ్యుడి మృతదేహం ఇంకా ఆసుపత్రి మార్చురీలోనే ఉందని, వచ్చి తీసుకెళ్లగలరని చెప్పారు. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి వెళ్లి డెడ్‌బాడీని తీసుకొచ్చారు. బంధుమిత్రుల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ‘ఆ కుటుంబానికి ఎదురైన పరిస్థితిని తలచుకుంటేనే బాధగా ఉంది. ఈ ఘటనకు మేము పూర్తి బాధ్యత వహిస్తున్నాము. ఈ ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటాము. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వము’ అని జార్జ్ యూనివర్శిటీ ఆస్పత్రి అధికారి అనేయురిన్ బెవన్ అన్నారు.

Updated On 11 Dec 2023 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story