ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇళ్లలో ఈడీ అధికారుల సోదాలు చేపట్టారు. కవిత భర్త అనిల్ సోదరి అఖిల ఇంట్లో శనివారం ఉదయం నుంచే సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు. మాదాపూర్‌లోని అనిల్ సోదరి అఖిల నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి

kavitha adabidda akhila-compressed
ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆడపడుచు ఇళ్లలో ఈడీ (Enforcement Directorate) అధికారుల సోదాలు చేపట్టారు. కవిత భర్త అనిల్ (Anil) సోదరి అఖిల (Akhila) ఇంట్లో శనివారం ఉదయం నుంచే సోదాలు చేపట్టిన ఈడీ అధికారులు. మాదాపూర్‌లోని అనిల్ సోదరి అఖిల నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఈరోజు కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో (Rouse Avenue Court) హజరుపర్చనున్నారు. కవితకు మరికొన్ని రోజులపాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరే అవకాశముంది. కవితకు ఈడీ కస్టడీ పొడిగింపు లేదా జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని దర్యాప్తు సంస్థ కోరే అవకాశం కూడా ఉంది. గత ఆరు రోజులుగా ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్‌లో అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు.
