Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూటింగ్‌కు అనుకోని గెస్ట్..!
వివాహం..(Marriage) జీవితాంతం గుర్తుండిపోయే తీయని వేడుక. దీనికి సంబంధించిన జ్ఞాపకాలు జాగ్రత్తగా ఉండాలి కదా! ఈ మధ్య ఫొటోషూట్‌ల ట్రెండ్ మారింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్, కపుల్ షూట్(Couple shoot) తప్పనిసరి అయిపోయాయి. ఈ రోజుల్లో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎంత ట్రెండ్ అవుతున్నాయో మనకు తెల్సిందే. ప్రీవెడ్డింగ్ షూటింగ్(Pre wedding shooting) కోసం రకరకాల లొకేషన్లు వెతుక్కుంటారు. తమ బడ్జెట్‌కు అనుగుణంగా ప్రీవెడ్డింగ్ షూట్‌ను ప్లాన్ చేసుకుంటారు. కొందరు రిచ్‌గా ప్లాన్ చేసుకుంటారు. ఇందుకోసం దేశ విదేశాల్లోని పలు ప్రాంతాలకు వెళ్తుంటారు.

అయితే అతి త్వరలో వివాహం చేసుకోబోయే జంట ప్రీవెడ్డింగ్ ప్లాన్ చేసుకుంది. ఈ ప్రీవెడ్డింగ్ షూట్‌కు ఓ నదిని(River) ఆ జంట ఎంచుకుంది. ప్రవహిస్తున్న నీటి మధ్యలో కూర్చొని ప్రీవెడ్డింగ్ షూట్‌కు ప్లాన్ చేస్తున్నారు. కాబోయే జంటను కెమెరామెన్లు(Cameramen) రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు తీసేందుకు ఫ్రేమ్స్ సిద్ధం చేసుకుంటున్నారు. ప్రవాహంలో ఉన్న ఓ రాయిపై నిల్చుని కెమెరామెన్ ఫొటోలు తీస్తున్నారు. ఇంతలోనే అనుకోని అతిథి అక్కడికి వచ్చింది. వీరు షూటింగ్ చేసే ప్రదేశానికి పాము(Snake) వచ్చింది. దీంతో కాబోయే వధువు కొంత భయపడింది. భయంతో కేకలు పెట్టింది. ప్రశాంతంగా ఉంటూ పామును వారు ఏమీ అనకపోవడంతో.. అది ఆ జంట మధ్యలోంచి సర్రున వెళ్లిపోయింది. ఆ సమయంలో తనకు కాబోయే భార్య(Wife) చేతిని పట్టుకొని యువకుడు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాడు. పాము ఎవరికీ హానీ చేయకుండా వెళ్లడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చుట్టేస్తోంది. దీనిపై పలువురు నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. కాబోయే భార్య చేయి పట్టుకొని ఆమెకు ధైర్యాన్ని ఇచ్చిన యువకుడిని పొగుడుతున్నారు. భర్త అంటే ఎప్పటికీ భార్య చేయిని పట్టుకునే ఉండడమే దీని అర్థమంటున్నారు. భర్త అంటే ఇదే అన్న నమ్మకాన్ని ఆమెకు కలిగించాడని మరొకరు కామెంట్ చేశారు.