పీకలదాక తప్పతాగిన పెళ్లికొడుకు సంగీత్‌ ఫంక్షన్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్న అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదేమిటని అడిగిన పెళ్లికూతురుపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన ఆమె సోదరుడిని చితకబాదాడు. పెళ్లికూతురు కుటుంబసభ్యులు కొత్త పెళ్లికొడుకుపై కేసు పెట్టారు. పెళ్లి ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చును తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. జూబ్లీహిల్స్‌లో ఉండే ఓ యువతి కుటుంబసభ్యులకు చిత్తూరుకు చెందిన తేజ స్వీట్స్‌ అధినేత, ప్రముఖ ఫైనాన్షియర్‌ ఏ.రవిబాబు కుటుంబసభ్యులతో పరిచయం ఏర్పడింది.

పీకలదాక తప్పతాగిన పెళ్లికొడుకు సంగీత్‌ ఫంక్షన్‌ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్న అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదేమిటని అడిగిన పెళ్లికూతురుపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన ఆమె సోదరుడిని చితకబాదాడు. పెళ్లికూతురు కుటుంబసభ్యులు కొత్త పెళ్లికొడుకుపై కేసు పెట్టారు. పెళ్లి ఏర్పాట్ల కోసం చేసిన ఖర్చును తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. జూబ్లీహిల్స్‌లో ఉండే ఓ యువతి కుటుంబసభ్యులకు చిత్తూరుకు చెందిన తేజ స్వీట్స్‌ అధినేత, ప్రముఖ ఫైనాన్షియర్‌ ఏ.రవిబాబు కుటుంబసభ్యులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వియ్యమందుకునేంత వరకు వెళ్లింది. తన కుమారుడు ఏ.వైష్ణవ్‌తో బాధిత యువతికి సంబంధం మాట్లాడుకున్నారు రవిబాబు. ఇందుకు మూడు కోట్ల రూపాయల కట్నం అడిగారు.. యువతి తల్లిదండ్రులు ఇందుకు ఒప్పుకున్నారు. లాస్టియర్ సెప్టెంబర్‌లో తిరుపతిలోని తాజ్‌ హోటల్‌లో ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

లాస్ట్‌మినిట్‌లో ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకున్నారు వైష్ణవ్ కుటుంబసభ్యులు. నవంబర్‌లో నిశ్చితార్థ కార్యక్రమం పెట్టుకుందామన్నారు. దీనికి సరేనన్నారు యువతి సంబంధీకులు. అయితే కొన్ని కారణాల వల్ల ఎంగేజ్‌మెంట్‌ జరగలేదు. నేరుగా పెళ్లి చేద్దామని రెండు ఫ్యామిలీలు నిర్ణయించాయి. నవంబర్‌ 20న లగ్నపత్రిక రాసుకున్నారు. ఆ సమయంలో పెళ్లికుమార్తె తండ్రి వైష్ణవ్‌కు డైమండ్‌ రింగ్‌, రోలెక్స్‌ వాచీ, బంగారు గొలుసు పెట్టారు. వైష్ణవ్‌ కుటుంబసభ్యులు పెళ్లికూతురుకు నెక్లెస్‌ పెట్టారు. ఫిబ్రవరి తొమ్మిదిన పెళ్లి పెట్టుకున్నారు. ఇందుకోసం మొయినాబాద్‌లోని బ్రౌన్‌ రిసార్ట్‌ను ఫిబ్రవరి ఏడు నుంచి పది వరకు బుక్‌ చేసుకున్నారు. ఓ అర కోటి రూపాయలతో పెళ్లి ఏర్పాట్లు చేశారు. పెళ్లికి ముందు నిర్వహించే సంగీత కార్యక్రమంలో జరిగే డాన్స్‌ కోసం రిహార్సల్స్‌ చేసేందుకు పెళ్లికొడుకుతో పాటు అతడి బంధువులు కూడా వచ్చారు. అప్పటికే వరుడు తప్పతాగి ఉన్నాడు. మహిళా కొరియోగ్రాఫర్‌తో కలిసి డాన్స్‌ చేస్తున్న వైష్ణవ్‌ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇతర మహిళలతో కూడా ఇలాగే బిహేవ్‌ చేశాడు. ఇది గమనించిన పెళ్లికూతురు ఇదేమిటని ప్రశ్నించింది.

మద్యం మత్తులో ఉన్న వైష్ణవ్‌, అతడి స్నేహితులు పెళ్లికూతురును దుర్భాషలాడారు. అక్కడితో ఆగకుండా దాడికి దిగారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన పెళ్లికూతురు సోదరుడిని కూడా బాగా కొట్టారు. ఓ చిన్నపాటి యుద్ధమే అక్కడ జరిగింది. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు కానీ పెళ్లి కూతురు ఒప్పుకోలేదు. తన కళ్లెదుటే మద్యం తాగి, డ్రగ్స్‌ తీసుకుని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైష్ణవ్‌ను ససేమిరా పెళ్లి చేసుకోనని చెప్పేసింది. పెళ్లి క్యాన్సల్ కావడంతో పెళ్లి ఏర్పాట్ల కోసం పెట్టిన 50లక్షల రూపాయలతో పాటు తాము వరుడికి పెట్టిన వస్తువులను తిరిగి ఇవ్వాలని వధువు ఫ్యామిలీ కోరింది. కానీ వైష్ణవ్‌ తల్లిదండ్రులు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు, ఆభరణాలు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక లాభం లేదనుకున్న యువతి తల్లిదండ్రులు జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో కంప్లయింట్‌ చేశారు. వైష్ణవ్‌తోపాటు కుటుంబసభ్యులు ఏ.రవిబాబు, దేవి, తేజు, శ్రవణ్‌తోపాటు స్నేహితులు శరత్‌రెడ్డి, మనోజ్‌, భరత్‌ తదితరుల పై ఐపీసీ 354, 324, 420, 506 సెక్షన్లతో పాటు వరకట్న వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Updated On 8 April 2023 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story