Zombie Virus with Drugs : డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి జాంబి వైరస్.?
అగ్రరాజ్యం అమెరికా ప్రధాన నగరాల్లో యువత జాంబీల మాదిరిగా వింతగా ప్రవర్తిస్తున్నారు . అక్కడ స్థానిక ప్రజలు వాళ్లకు సంబంధించిన వీడియోలను సామాజిక మద్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.. దాంతో ఇప్పుడు అంతా ఈ విషయం గురించే గురించి చర్చ జరుగుతుంది. అసలు వాళ్ళు అలా ప్రవర్తించడానికి xylazine అనే డ్రగ్ ని అతిగా తీసుకోవడం అని తేల్చి చెప్పారు వైద్యులు.. అమెరికాలోని చాల ప్రధాన నగరాల్లో ఈ డ్రగ్ ని తక్కువ ధరకే అమ్మడం తో అక్కడ […]
అగ్రరాజ్యం అమెరికా ప్రధాన నగరాల్లో యువత జాంబీల మాదిరిగా వింతగా ప్రవర్తిస్తున్నారు . అక్కడ స్థానిక ప్రజలు వాళ్లకు సంబంధించిన వీడియోలను సామాజిక మద్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.. దాంతో ఇప్పుడు అంతా ఈ విషయం గురించే గురించి చర్చ జరుగుతుంది. అసలు వాళ్ళు అలా ప్రవర్తించడానికి xylazine అనే డ్రగ్ ని అతిగా తీసుకోవడం అని తేల్చి చెప్పారు వైద్యులు.. అమెరికాలోని చాల ప్రధాన నగరాల్లో ఈ డ్రగ్ ని తక్కువ ధరకే అమ్మడం తో అక్కడ యువత దీనిని విచ్చల విడిగా వినియోగిస్తున్నారు . హెరాయిన్,కొకైన్ మాదిరిగినే మత్తుని అందిస్తుంది ఈ డ్రగ్ . అతిగా దీన్ని తీసుకోవటం వలన మెదడు పైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది .అతిగా నిద్రపోవటం,శ్వాసలో ఇబ్బంది , చర్మం పైన పగుళ్లు ఏరపడుతాయి ,చర్మం పొడిబారిపోయి ,కుళ్లిపోతుంది .రక్తస్రావం జరుగుతుంది . వారికేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో వింతగా రోడ్ల మీద ప్రవర్తిస్తున్నారు .
ట్రాంక్ (traank ),ట్రాంక్ డోప్, జోంబీ డ్రగ్ అని కూడా దీనిని పిలుస్తున్నారు. US food and drug administration దీనిని ఆమెదించింది . జంతువులకు వాడే ఈ డ్రగ్ ని మనుషులు వాడటం అత్యంత ప్రమాదకరం అని నిపుణులు తెలుపుతున్నారు. ఈ డ్రగ్ ని తీసుకోవటం వల్ల ఇన్ఫెక్షన్ ఏర్పడిన భాగానికి వెంటనే చికిత్స అందివ్వకపోతే శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగాఉంటాయి . ట్రీట్మెంట్ ఇచ్చిన తిరిగి కోలుకునే అవకాశాలు కూడా తక్కువ అని భావిస్తున్నారు .
తీవ్రమైన ఒంటి నొప్పుల కోసం ఈ డ్రగ్ ని వాడుతుంటారు . గతం లో అమెరికా లో ఫెలిఫిడియా లో అత్యధికం గ ఈ డ్రగ్ ని వినియోగించటం వలన యువత రోడ్ల పైన వింత చేష్టలతో కనిపించటం సోషల్ మీడియాలో షేర్ చేయటం జరిగింది అది ఒక వింత వైరస్ అని జోంబీ మాదిరిగా వీరి ప్రవర్తన ఉండటం తో దానికి జొంబి వైరస్ అని పేరు పెట్టారు. కానీ ఇది వైరస్ సోకటం వల్ల వచ్చిన వ్యాధి కాదని xylazine అనే జంతు సంబంధమైన డ్రగ్ ని వాడకం వల్ల జరిగిందని ధ్రువీకరించారు. 2021 న్యూయార్క్ లో ఈ డ్రగ్ ని వాడటం వల్ల 2,600 చనిపోయారు. ఇప్పుడు శాంఫ్రాసిస్కో ,లాస్ ఏంజిల్స్ లాంటి ప్రధాన నగరాల్లో కూడా విరివిగా వీటి అమ్మకాలు సాగుతువుండటం తో అక్కడ యువత వీటికి బానిసలుగా మారి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.