BS Rao Passed Away : శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బీఎస్ రావు కన్నుమూత
శ్రీ చైతన్య విద్యా సంస్థల(Sri Chaithanya Educational institutions) చైర్మన్ డాక్టర్ బీఎస్ రావు(BS Rao) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో బాత్ రూమ్‌లో(Bathroom) కాలు జారి(Slipped) పడిన ఆయన.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.
శ్రీ చైతన్య విద్యా సంస్థల(Sri Chaithanya Educational institutions) చైర్మన్ డాక్టర్ బీఎస్ రావు(BS Rao) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో బాత్ రూమ్‌లో(Bathroom) కాలు జారి(Slipped) పడిన ఆయన.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. బీఎస్ రావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు హైద్రాబాద్ నుంచి విజయవాడ తరలించనున్నారు. రేపు అంత్యక్రియలు(Funeral) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బీఎస్ రావు పూర్తి బొప్పన సత్యనారాయణ రావు.
1986లో బీఎస్ రావు శ్రీ చైతన్య విద్యా సంస్థలను స్థాపించారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల శ్రీ చైతన్య విద్యాసంస్థలను నెలకొల్పారు. 1991లో హైదరాబాద్‌లో బాలుర జూనియర్ కాలేజీని స్థాపించారు. ఆ తర్వాత ఏపీ, తెలంగాణలో 321 ఇంటర్ కాలేజీలు, 322 శ్రీ చైతన్య టెక్నో స్కూళ్లు, ఇతర రాష్ట్రాల్లో 107 సీబీఎఈ అనుబంధ పాఠశాలలను స్థాపించారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల్లో 8.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.