నిత్యం మనలో ప్రతి ఒక్కరికి ప్రతి రోజు ఏదోఒక కలలు వస్తూనే ఉంటాయి .చాల వరకు కలలు మనకి తెల్లవారేసరికల్లా మర్చిపోతువుంటాం కూడా. మన రోజు వారి జీవితం లో ఎదురయ్యే సంఘటనలు ,ఎక్కువగా ఆలోచించే విషయాలు ,మనకిబాగా గుర్తున్న సందర్భాలు చిన్న మెదడు లో ఎక్కడ ఒక చోట భద్రపరచి ఉంచుతుందట .దాని వలనే మనకి కలలు వస్తూఉంటాయి అని వైద్యనిపుణులు చెప్తూఉంటారు . కానీ మనకు కలలో వచ్చే ఎన్నో విషయాల ద్వారా మనకి […]

నిత్యం మనలో ప్రతి ఒక్కరికి ప్రతి రోజు ఏదోఒక కలలు వస్తూనే ఉంటాయి .చాల వరకు కలలు మనకి తెల్లవారేసరికల్లా మర్చిపోతువుంటాం కూడా. మన రోజు వారి జీవితం లో ఎదురయ్యే సంఘటనలు ,ఎక్కువగా ఆలోచించే విషయాలు ,మనకిబాగా గుర్తున్న సందర్భాలు చిన్న మెదడు లో ఎక్కడ ఒక చోట భద్రపరచి ఉంచుతుందట .దాని వలనే మనకి కలలు వస్తూఉంటాయి అని వైద్యనిపుణులు చెప్తూఉంటారు . కానీ మనకు కలలో వచ్చే ఎన్నో విషయాల ద్వారా మనకి జీవితం లో ఏమి జరగబోతుంది అనేది చెప్పచు అంటుంది స్వప్న శాస్త్రం .అలాగే మన భారతీయులకు ఉండే ఎన్నో నమ్మకాల్లో కల ల వల్ల ఇది జరుగుతుంది అనే నమ్మకం కూడా ఒకటి. మొత్తానికి కలల వల్ల మనకు కొన్ని జరగబోయే విషయాలు ముందుగా తెలుస్తాయి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెల్సుకుందాం .

ముఖ్యంగా తెల్లవారు జామున వచ్చే కలలు ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది మనలో చాల మంది కి నమ్మకం. మనకి మంచి జరగబోతున్న ,చెడుఁజరగబోతున్న వాటిని భగవంతుడు కొన్ని సంకేతాలను కలల రూపం లో పంపిస్తాడు అనేది కూడా నిజమని నమ్ముతుంటాం .కానీ మనకు వచ్చే ప్రతి కల కి ఒక అర్ధం వుండి తీరుతుంది . అలాగే మనకు మంచి జరిగే ముందు వచ్చే కొన్ని కల లను ఎవరితో పంచుకోకూడదు కూడా . కలలో ఆలయాలు ,దేవుడిపటాలు కనుక వస్తే మీరు త్వరలోనే ధనలాభం పొందుతారని సంకేతం. జమ్మి చెట్టు ,రావి చెట్టు కలలో కనిపిస్తే మీరు అనుకున్న ఉద్యోగాలు పొందుతారు .

నీరు ఉండే ప్రదేశాలు ,జలపాతాలు,నదులు లాంటివి కలలో వస్తే వారికీ త్వరలోనే అదృష్టకాలం సిద్ధిస్తుంది అనడానికి ఇదే సంకేతం. అలాగే కలలో గుర్రం ,తెల్ల గుర్రం,ఏనుగులు కనిపిస్తే అది లక్ష్మి కటాక్షానికి సంకేతం. లక్ష్మి దేవి సంకేతాలు గా వీటిని భావిస్తారు .ఉదయిస్తున్న సూర్యుడు మీ కలలో కనిపిస్తే మీకు జీవితం లో ఎలాంటి లోటు ఇక ఉండదు అనడానికి సంకేతం .. ఇలా మంకు మంచి జరిగే ముందు ,కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మి కటాక్షమ దొరికే సంకేతాలు కలల రూపం లో వచ్చినపుడు మనం వీటిని ఎవరితో పంచుకోవడం మంచిది కాదు .

గమనిక :పైన పేర్కొనబడిన విషయాలు శాస్త్రాల ద్వారా ,జోతిష్య నిపుణుల ద్వారా ,పుస్తకాల ద్వారా సేకరించటం జరిగింది మాత్రమే అని వీటికి శాస్త్రియత ఆధారం గా ఎలాంటి రుజువులు లేవని గమనించగలరు .

Updated On 27 Feb 2023 8:27 AM GMT
Ehatv

Ehatv

Next Story