ఎలుకలు(rats) తిరుగుతున్నాయని ఇంటిని తగలబెట్టుకుంటామా చెప్పండి? ఇలాంటి తలతిక్క పనే అమెరికాలో(america) ఒకరు చేస్తున్నారు. ఆయన తగలెట్టడం లేదు కానీ ఇంటిని కూల్చేస్తున్నాడు. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ రాజభవనం(mansion) త్వరలో నేలమట్టం కానుంది. విషయానికి వస్తే అమెరికాకు చెందిన ఒకప్పటి టెలివిజన్‌ టాక్‌ షో రూపశిల్పి, నిర్మాత ఫిల్‌ డోనాహ్యూ(Donahue) బంగ్లా అది! కాకపోతే ఎప్పుడో దాన్ని ఆయన 200 కోట్ల రూపాయలకు అమ్మేశాడు. అలా చేతులు మారిన ఇంద్రభవనంలాంటి ఆ భవనం ఇప్పుడు కూల్చేయాలనుకుంటున్నారు ప్రస్తుత యజమానులు.

ఎలుకలు(rats) తిరుగుతున్నాయని ఇంటిని తగలబెట్టుకుంటామా చెప్పండి? ఇలాంటి తలతిక్క పనే అమెరికాలో(america) ఒకరు చేస్తున్నారు. ఆయన తగలెట్టడం లేదు కానీ ఇంటిని కూల్చేస్తున్నాడు. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ రాజభవనం(mansion) త్వరలో నేలమట్టం కానుంది. విషయానికి వస్తే అమెరికాకు చెందిన ఒకప్పటి టెలివిజన్‌ టాక్‌ షో రూపశిల్పి, నిర్మాత ఫిల్‌ డోనాహ్యూ(Donahue) బంగ్లా అది! కాకపోతే ఎప్పుడో దాన్ని ఆయన 200 కోట్ల రూపాయలకు అమ్మేశాడు. అలా చేతులు మారిన ఇంద్రభవనంలాంటి ఆ భవనం ఇప్పుడు కూల్చేయాలనుకుంటున్నారు ప్రస్తుత యజమానులు. బీచ్‌కు చాలా దగ్గరగా ఉన్న ఈ భవంతి మరి కొన్ని రోజుల తర్వాత ఉండదన్న భావనే చాలా మందిని కలచివేస్తున్నది. చుట్టు పక్కన ఉన్నవారు కూడా బాధపడుతున్నారు. రాజభవనంలా ఉండే గోల్డ్‌ కోస్ట్ భవనం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనానికి రైనల్‌, ఆమె భర్త గ్యారీ యజమానులు. వెస్ట్‌పోర్ట్‌లో హాలీవుడ్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌లో భాగమైన ఈ ఆకర్షణీయమైన ఈ బంగ్లా కొద్ది రోజుల్లోనే కనుమరుగవనుంది. ఎనిమిదో దశకంలో డోనాహ్య, ఆయన భార్య, నటి మార్లో థామస్‌ వేసవిలో ఈ బంగ్లాలో సేద తీరేవారు. ఎంతోమంది నటీనటులు ఇక్కడ గడిపి వెళ్లేవారు.

2006లో డోనాహ్య ఆ బంగ్లాకు దగ్గరలో ఉన్న మరో మల్టీ మిలియన్‌ డాలర్‌ గోల్డ్‌ కోస్టును(Gold cost) కొన్నారు. తర్వాత ఈ బంగ్లాను రికార్డు స్థాయిలో 200 కోట్ల రూపాయలకు అల్లిసన్‌ (Allison)అనే ఫైనాన్షియర్‌కు అమ్మేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా(Obama) దగ్గర అల్లిసన్‌ అసిస్టెంట్‌ ట్రెజరీ కార్యదర్శిగా పని చేసేవారు. ఒబామా కూడా ఈ అందమైన భవనాన్ని సొంతం చేసుకోవాలని ముచ్చటపడ్డారట. కాకపోతే అన్నేసి డబ్బులు లేకపోవడంతో కోరికను చంపేసుకున్నారు. 2013లో అల్లిసన్‌ చనిపోయారు. ఆ తర్వాత ఈ భవంతిని పట్టించుకున్నవారు లేరు. 2020లో రైనర్‌ దంపతులు ఈ భవనాన్ని కేవలం 136 కోట్ల రూపాయలకు కొన్నారు. వారు కొన్న సమయంలో ఆ భవనం పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండింది. రాత్రి పూట ఎలుకలు సంచరించేవి. ఎలుకల బాధ భరించలేక ఈ బంగ్లాను కూల్చేయాలనుకున్నారు రైనర్‌ దంపతులు. అందుకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా హిస్టారిక్‌ కమిషన్‌కు దరఖాస్తు చేసుకుననారు. హిస్టారిక్‌ డిస్డ్రిక్‌ కమిషన్‌ ఈ అందమైన కట్టడం కూల్చడం కోసం 180 రోజులు వేచి చూడాలని స్పష్టం చేసింది. ఈలోగా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తామని కమిషన్‌ తెలిపింది. అలాగే అందులో ఉండే అద్భుతమైన కళాఖండాన్ని తిరిగి ఉపయోగించుకునే అవకాశాలున్నాయా అని పరిశీలిస్తోంది. అలాగే అందులో ఉపయోగించిన రాతి స్తంభాలను పరిరక్షించాలని కమిషన్‌ అనుకుంటోంది.

Updated On 10 Jun 2023 7:37 AM GMT
Ehatv

Ehatv

Next Story