కుక్కలను ఎందుకు పెంచుకుంటాం? ఇంటికి కాపలాగా ఉంటుందని..! రక్షణగా ఉంటుందని..! దొంగలు రాకుండా కాపాడుతుందని..! ఇది కాకుండా కొందరు అభిరుచి కోసం కుక్కలను పెంచుకుంటుంటారు. ఇంట్లో ఓ సభ్యుడిగా చూసుకుంటారు. వాటికి రాజభోగాలు కల్పిస్తుంటారు.. ఇప్పుడీ శునకాల టాపిక్‌ ఎందుకంటారా? అక్కడికే వస్తున్నా... రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సంచార జాతి ఉంది. వీరు కుక్కలను ఆస్తిగా భావిస్తుంటారు. వాటిని ఆడపిల్లలకు కట్నంగా ఇస్తుంటారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం!

రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district)లోని మూడు గ్రామాలలో గంగిరెద్దుల కుటుంబాలు కనిపిస్తాయి. కోనరావుపేట మండలం కొండాపూర్‌, బావుసాయిపేట, చందుర్తి మండలం రామారావుపల్లె గ్రామాలలో సుమారు వంద కుటుంబాలున్నాయి. వీరు ఓ ఊరి నుంచి మరో ఊరుకు వెళుతూ భిక్షాటన చేస్తారు. తాము సేకరించిన ఆహారంతో కుక్కలను పోషిస్తారు. తమకింత తిండిపెట్టిన వారిపై శునకాలు బోల్డంత విశ్వాసాన్ని చూపిస్తాయి. తమ యజమానులు ఉండే గుడారాలకు రక్షణగా నిలుస్తాయి. అప్పుడప్పుడు వేటలో కూడా పాల్గొంటుంటాయి. ఒక్కో కుటుంబంలో అయిదు నుంచి పది కుక్కలు ఉంటాయి. కొన్ని కుటుంబాలలో ఈ సంఖ్య ఇరవై ఉన్నా ఆశ్చర్యపడనక్కర్లేదు. వీరు శునకాలను ఆస్తిగా భావిస్తారు. అంటే ఎన్ని కుక్కలుంటే అంత ఆస్తిపరుడన్నమాట. పైగా ఈ సంఖ్యను బట్టే ఆ కుటుంబపెద్దకు వారి కులంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆడపిల్లలకు పెళ్లిలో కట్నంగా శునకాలు ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది.. తమ ఆస్తిలో భాగమిచ్చినట్టన్నమాట. ఈ ఆచారం గంగిరెద్దుల కుటుంబాలలో అనాదిగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు వారిలో కూడా మార్పు మొదలయ్యింది. భిక్షాటనకు బదులుగా కొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు. కొందరు చిన్న చిన్న బుట్టల్లో ప్లాస్టిక్‌ సామాన్లు అమ్ముకుంటున్నారు. ఈ విధంగా పొట్టపోసుకుంటున్నారు.

Updated On 20 April 2023 1:30 AM GMT
Ehatv

Ehatv

Next Story