Alcohol Addicted Dog: మందుకి బానిసై డిప్రెషన్ లోకి వెళ్లిన కుక్క.. ఎలా అలవాటు చేసుకుందో తెలిసా.?
మద్యానికి బానిసలైన వారిని ఏంతో మందిని చూస్తుంటాం. ప్రపంచం మొత్తంలో కూడా ఈ మద్యానికి అలవాటు పడి అలవాటుని వదులుకోలేక ఎంతో మంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు . ఈ అలవాటు ఒక్క మనుషుల్లోనే చూస్తుంటాం . కానీ ఇక్కడ విచిత్రంగా ఒక కుక్క ఆల్కహాల్(alcohol) కి విపరీతంగా బానిస అయింది . మందు దొరకగా చాన్నాళ్లు డిప్రెషన్ లో కి వెళ్ళిపోయింది . మందుకు బానిసగా మారిన ఈ శునకానికి ఆల్కహాల్ విత్డ్రావెల్'(alcohol withdravel) అనే వ్యాధి లక్షణాలు మొదలయ్యాయి అని డాక్టర్లు చెప్పారు .

అసలు విషయం ఏంటి అంటే ,ఇంగ్లాండ్(England)లోని ప్లైమౌత్ (flymouth)అనే ప్రాంతలో నివాసం ఉండే ఒక వ్యక్తి ల్యాబ్ బ్రీడ్ డాగ్(Labrador) ను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు . ఆ డాగ్ పేరు" కోకో(koko) ".ఆ యజమానికి మందు తాగే అలవాటు ఉంది. అతను రోజు మందు తాగి రాత్రి పూట మిగిలిన మద్యం బోటిల్ గ్లాస్ అక్కడనే అలానే వదిలేసావాడు .అనుకోకుండా కింద వలిగిన మద్యాన్ని రుచి చూసిన కోకో కు రోజు మద్యం వాసనా చూసి తాగడం అనేది ఒక వ్యసనం గా అయిపోయింది . కొద్దీ రోజుల తరువాత కోకో యజమాని చనిపోగా కోకో కు మద్యం దొరకక డిప్రెషన్ స్టేజి కి వెళ్లి ఏమి తినడం మానేసింది . ఇంట్లో వాళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్లగా తీవ్ర డిప్రెషన్లో ఉన్న కోకొను యూకేలోని వుడ్సైడ్ యానిమల్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు(wood side animal welfare) చూసి షాక్ అయ్యారు. మద్యానికి బానిసై, కోలుకోలేకపోతున్న డాగ్ ని చూస్తుండటం ఇదే మొదటిసారి అని వెటర్నరీ డాక్టర్లు చెప్పారు .
మద్యానికి బానిసల మారిన కోకో ను తిరిగి మాములు స్థితికి తీసుకురావటానికి వైద్యులు నాలుగు వారలు పాటు చికిత్సను అందించారు . కోకో కు ఇంటెన్సివ్ ట్రీట్మెంట్(incentive treatment) ఇచ్చారు. ఆల్కహాల్ విత్డ్రావెల్(alcohol withdravel) వ్యాధి లక్షణాలు తగ్గి, ఫిట్స్ రాకుండా ఉండేందుకు వైద్యులు జాగ్రత్తగా వైద్యాన్ని అందించారు .మొదట్లో అత్యంత విషమంగా ఉన్న కోకో పరిస్థితి ప్రస్తుతం నెమ్మదిగా మామలు స్థితి కి రాగలిగింది అని కాని మానసికంగా పూర్తి ఆరోగ్యం కోకో ఇంకా కలిగి లేదని వైద్యులు చెప్పారు .వుడ్సైడ్ యానిమల్ వెల్ఫేర్ ట్రస్ట్(wood side animal welfare) ఈ విషయాన్ని ఫేస్బుక్(Facebook) పోస్ట్ ద్వారా వెల్లడించింది . కుక్కలకు మద్యాన్ని ఇవ్వడం అత్యంత ప్రమాదకరం అని వైద్యులు చెప్తున్నారు . గ్లాస్ బీరు కూడా కుక్కలా కు ప్రాణాంతకం అని చెప్పడం జరిగింది.