నేపాల్ లో ఓ యువకుడి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. కడుపులో వోడ్కా బాటిల్ ఉందని గుర్తించిన డాక్టర్లు ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో శస్త్రచికిత్స చేసి తొలగించారు..

నేపాల్ లో ఓ యువకుడి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. కడుపులో వోడ్కా బాటిల్ ఉందని గుర్తించిన డాక్టర్లు ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా మారడంతో శస్త్రచికిత్స చేసి తొలగించారు..

రౌతహత్ జిల్లాలోని గుజ్రా మున్సిపాలిటీకి చెందిన 26ఏళ్ల యువకుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కొన్ని రోజుల పాటు విపరీతమైన కడుపునొప్పి, వాంతులతో నూర్సాద్ మన్సూరి భాదపడుతూ ఉండటం తో అతడినీ ఆస్పత్రి లో చేర్పించారు . మన్సూరికి డాక్టర్లు ఎండోస్కొపి, స్కానింగ్ లు చేసి.. రిపోర్టులు చుసిన డాక్టర్లు ఒక్కసారే షాక్ అయ్యారు . కడుపులో ఏదో గాజు పదార్థం ఉందని గుర్తించారు. క్షణక్షణానికి ఆ యువకుడి పరిస్థితి విషమించడంతో వెంటనే సర్జరీ చేయాలని నిర్ణయించారు.

డాక్టర్ల టీమ్ అత్యవసర శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆపరేషన్ సమయంలో కడుపులో ఉన్న వోడ్కా బాటిల్ ను చూసి నివ్వెరపోయారు . దాదాపుగా రెండున్నర గంటల సమయం శ్రమపడి బాటిల్ ని బయటకు తీయడం లో నేపాల్ వైద్యులు విజయం సాధించారు . మద్యం సీసా వల్ల పేషెంట్ పేగు పగిలిందని, దీంతో పరిస్థితి విషమంగా ఉందని శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు పేర్కొన్నారు. పేగు పగిలిపోవడంతో మలం కారుతోంది. ఆపరేట్ చేయడం తప్ప మాకు వేరే మార్గం లేదు.. ఈ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి.. కానీ శస్త్రచికిత్స విజయవంతమైంది.. ఇప్పుడు రోగి ప్రమాదం నుంచి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు.

Updated On 14 March 2023 3:59 AM GMT
Ehatv

Ehatv

Next Story