వాస్తవానికి శరీరం (Body), ఆత్మ (soul) రెండు వేర్వేరు. మనిషి జీవిత కాలం 120 ఏళ్లు కానీ.. మన ఆహారపు అలవాట్లు, మన జీవనశైలి వ్యవహారం వల్ల 100 ఏళ్లకు తగ్గింది. ఇంకా కొందరైతే 60 ఏళ్లలోపే అనారోగ్య సమస్యలకు గురై కాలం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చిన్నవయసులోనే గుండెపోట్లతో (Heart Strokes) మరణిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనా.. మన ఆహార అలవాట్లే.. జీవనశైలి ఆధారంగానే ఆయుష్షు కంటే ముందే ఆత్మీయులను మనం కోల్పోతున్నాం

వాస్తవానికి శరీరం (Body), ఆత్మ (soul) రెండు వేర్వేరు. మనిషి జీవిత కాలం 120 ఏళ్లు కానీ.. మన ఆహారపు అలవాట్లు, మన జీవనశైలి వ్యవహారం వల్ల 100 ఏళ్లకు తగ్గింది. ఇంకా కొందరైతే 60 ఏళ్లలోపే అనారోగ్య సమస్యలకు గురై కాలం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చిన్నవయసులోనే గుండెపోట్లతో (Heart Strokes) మరణిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనా.. మన ఆహార అలవాట్లే.. జీవనశైలి ఆధారంగానే ఆయుష్షు కంటే ముందే ఆత్మీయులను మనం కోల్పోతున్నాం. ఆత్మ చెప్పినట్లు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోతే ఆత్మ అందులో ఉండదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్లు శరీరం వినే స్థితిలో లేదు.

శరీరం చనిపోయినప్పుడు.. శరీరం నుంచి ఆత్మ వేరవుతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా ఆత్మ మళ్లీ శరీరంలోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు శ్మశానానికి (cemetery) కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని (Rice) విప్పి కింద పోస్తారు. ఎందుకంటే... శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద, తన వాళ్ల మీద ఉన్న ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే.. ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం (Sunrise)లోపు మాత్రమే... అంతలోపు లెక్కించకపోతే, మళ్లీ తిరిగి మొదటి నుంచి లెక్కించాలి.

శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే కుండ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుంచి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో... శరీరం నుంచి ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే... ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాం. ఇకపై ఈ శరీరం ఉండదు, ఆత్మ ఇక నువ్వు వెళ్లిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతం.

హిందూ (Hindu) సాంప్రదాయంలో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు. అంత్యక్రియలు ఇలానే ఎందుకు చేస్తున్నారంటే ఏమో నాకు తెలియదు మన పూర్వీకులు (Ancestors) ఇలాగే చేశారు.. మనం కూడా ఇలాగే చేయాలన్న మూస ధోరణిలో వెళ్తున్నారే తప్ప.. ఇందులో ఉన్న నిగూఢ అర్థాలు (Esoteric meanings) తెలుసుకునే ప్రయత్నం చేయరు.

Updated On 21 Dec 2023 6:41 AM GMT
Ehatv

Ehatv

Next Story