Girl travels in Delhi Metro in bra and micro miniskirt : మైక్రో దుస్తులతో ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన అమ్మాయి ఎవరో తెలుసా?
ఢిల్లీ మెట్రో గర్ల్‌గా పాపులరైన అమ్మాయి పేరేమిటో తెలుసా? రిథమ్ చననా. బ్రా, మిని స్కర్ట్, కురుచ దుస్తుల్లో ఢిల్లీ మెట్రోరైలులో ప్రయాణిస్తూ మిగతా ప్రయాణికులను దిగ్భ్రాంతిలో ముంచెత్తుతోన్న ఆ అమ్మాయి ఎవరై ఉంటారా అన్న ఆసక్తి చాలా మందికి కలిగింది. సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఇలా చేస్తుందా? లేక మరేమైనా కారణముందా? ముంబాయికి చెందిన మోడల్ ఉర్ఫీ జావెద్ అడుగుజాడల్లో నడుస్తున్నాదా? ఎందుకంటే మొన్నటి వరకు ఉర్ఫీ జావెద్ చేసింది ఇదే కాబట్టి!

Girl travels in Delhi Metro in bra and micro miniskirt
ఢిల్లీ మెట్రో గర్ల్‌గా పాపులరైన అమ్మాయి పేరేమిటో తెలుసా? రిథమ్ చననా. బ్రా, మిని స్కర్ట్, కురుచ దుస్తుల్లో ఢిల్లీ మెట్రోరైలులో ప్రయాణిస్తూ మిగతా ప్రయాణికులను దిగ్భ్రాంతిలో ముంచెత్తుతోన్న ఆ అమ్మాయి ఎవరై ఉంటారా అన్న ఆసక్తి చాలా మందికి కలిగింది. సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఇలా చేస్తుందా? లేక మరేమైనా కారణముందా? ముంబాయికి చెందిన మోడల్ ఉర్ఫీ జావెద్ అడుగుజాడల్లో నడుస్తున్నాదా? ఎందుకంటే మొన్నటి వరకు ఉర్ఫీ జావెద్ చేసింది ఇదే కాబట్టి! ఇప్పుడు రిథమ్ చననా సోషల్ మీడియాలో తెగ పాపులర్! ఆమెను తిట్టేవాళ్లే ఎక్కువయ్యారు. సమాజాన్ని పాడు చేయడానికేనా ఇలాంటి దుస్తులు వేసుకుంటున్నది అని నిలదీసేవారు ఎక్కువయ్యారు. మొదట రిథమ్ చననా ఫోటోలు, వీడియోలు చూసి ఉర్ఫీ జావెదేమోనని అనుకున్నారంతా. ఇన్నాళ్లకు ఆమె అసలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఆమె ఎవరో తెలిసిపోయింది. @prettypastry11112222 ఇన్‌స్టాగ్రామ్ ఐడీతో రిథమ్ చననా పోస్టులు పెడుతోంది.
సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారడంతో మీడియా అటెన్షన్ కూడా ఆమెవైపు మళ్లింది. అసలు ఆమె ఎందుకిలా చేస్తున్నదో తెలుసుకుందామని ఓ జాతీయ ఛానెల్ ఆమెతో ముచ్చటించింది. తన పేరు రిథమ్ చననా అని, పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ తన స్వస్థలం అని చెప్పుకుంది. తనది ఎంతో సంప్రదాయ కుటుంబమని, మొదట్లో చాలా పద్దతిగా ఉండేదానినని తెలిపింది. ఎందుకో తెలియదు కానీ అకస్మాత్తుగా తన ఆలోచనలు మారాయని, అప్పట్నుంచి తనకు నచ్చినట్టుగా ఉండటం మొదలు పెట్టానని రిథమ్ చననా చెప్పుకొచ్చింది. ఇలా ఉండటం పేరంట్స్‌కు ఇష్టం లేకపోవడంతో ఇంట్లోంచి బయటకు వచ్చేసి స్వతంత్రంగా బతుకుతున్నానంది. తన మీద ఎవర ప్రభావం లేదంది. తన ఇష్ట ప్రకారమే ఇలాంటి దుస్తులు ధరిస్తున్నానని వివరించింది. పేరు కోసమో, పబ్లిసిటీ కోసమో, పది మంది దృష్టిలో పడాలన్న తాపత్రయం కోసమే ఇలా బతకడం లేదని, ఎవరేమనుకున్నా తాను పెద్దగా పట్టించుకోనని, తనకు నచ్చినట్టుగా బతుకుతానని రిథమ్ అంటోంది. చాలా మంది పైకి పద్దతిగా ఉంటారు కానీ, లోపలంతా దర్రిదమని, తాను ఎవరి జీవితాల్లోకి తొంగిచూడనప్పుడు .. తన జీవితంలోకి ఇతరులు ఎందుకు చూడటం అని ప్రశ్నించింది. నా పని చేసుకుంటూ నా బతుకు నేను బతుకుతున్నా. చాలదా?. అలాంటప్పుడు అవతలివాళ్ల అభిప్రాయాల్ని.. విమర్శలను ఎందుకు పట్టించుకోవడం? అని అంటోంది. పింక్ లైన్ మెట్రో రూట్‌లో తప్ప తను వేసుకున్న దుస్తులపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని చెబుతోంది. నిజంగానే పోయిన ఏడాది అక్టోబర్ వరకు రిథమ్ చననా పద్దతిగానే ఉంది.. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కటి ఫోటోలే ఉన్నాయి. కామ్ బిఫోర్ స్ట్రామ్ అంటూ ఓ బోల్డ్ ఫోటోను ఎప్పుడైతే పెట్టిందో అప్పట్నుంచి ఆమె పద్దతి మారింది. ఇప్పుడు ఈ స్టేజ్‌కి చేరుకుంది.
