కొన్నిసార్లు రిలేషన్‌షిప్‌లో కావచ్చు భార్య భర్తల (wife and husband )మధ్యలోకావచ్చు గొడవలు జరగడం మనస్పర్థలు అనేవి సర్వసాధారణం, కానీ మీరు ప్రతి విషయంలోనూ గొడవలు పడుతూ ఉంటే మాత్రం అది మీ మధ్య బంధాన్ని సాన్నిహిత్యాన్ని మరింత తగ్గిస్తుంది . మీరు ఏదైనా విషయంలో కోపంగా ఉండి, మీ సమస్యలను మీ జీవిత భాగస్వామి(partner ) ముందు సావధానం గా వ్యక్తపరిస్తే ,అది సమస్యను పరిష్కరిస్తుంది అంతే కానీ మీరు ఎటువంటి కారణం లేకుండా అతిగా స్పందించి, నిందలు వేయడం మొదలుపెట్టినప్పుడు ఆ సమ్యస అక్కడ నుండి మరింత తీవ్రమవుతుంది.

కొన్నిసార్లు రిలేషన్‌షిప్‌లో కావచ్చు భార్య భర్తల (wife and husband )మధ్యలోకావచ్చు గొడవలు జరగడం మనస్పర్థలు అనేవి సర్వసాధారణం, కానీ మీరు ప్రతి విషయంలోనూ గొడవలు పడుతూ ఉంటే మాత్రం అది మీ మధ్య బంధాన్ని సాన్నిహిత్యాన్ని మరింత తగ్గిస్తుంది . మీరు ఏదైనా విషయంలో కోపంగా ఉండి, మీ సమస్యలను మీ జీవిత భాగస్వామి(partner ) ముందు సావధానం గా వ్యక్తపరిస్తే ,అది సమస్యను పరిష్కరిస్తుంది అంతే కానీ మీరు ఎటువంటి కారణం లేకుండా అతిగా స్పందించి, నిందలు వేయడం మొదలుపెట్టినప్పుడు ఆ సమ్యస అక్కడ నుండి మరింత తీవ్రమవుతుంది. తగాదాలను రాకుండా ఉండాలంటే మీకు ఇష్టమైన వ్యక్తి లేదా భార్య భర్తల్లో రిలేషన్ లో మళ్లీ బంధాన్ని పెంచుకోవడానికి, సమస్యలను అడ్డు గోడలను దాటుకొంటూ సాఫీగాముందుకు సాగాలి జీవితం(life ) మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చుడండి .

రిలేషన్(relation) లో గొడవలు రాకుండా ఎలా జాగ్రత్తపడాలి

*గొడవ లేదా డిస్కషన్ లో ముందు ఎదుటివారు చెప్పేది వినటానికి'ప్రయత్నించండి. గొడవ సమయంలో
భాగస్వామి మాటలు వినడానికి బదులు సమాధానాలు ఇస్తూ ఉంటే, అది గొడవను పెంచడానికి పని చేస్తుంది. అందుకే మీరు భాగస్వామి ఎం చెప్పాలని అనుకుంటున్నారో విషయాన్ని వినడానికి ప్రయత్నిస్తే అలాగే వాళ్ళు ఏ విషయం పట్ల భాదపడుతున్నారో మనకు'స్పష్టంగా'అర్ధం అవుతుంది. సమస్యలను విని వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలో అర్ధం చేసుకుని ముందుకు వెళ్లే మానస్తత్త్వం ఇద్దరిలో కనీసం ఒక్కరికైనా ఉండాలి.

*కోపం(angry) లో ఎలాంటి వారమైన తప్పనిసరిగా సహనాన్ని(patience ) కోల్పోతుంటాము అలాంటపుడు అనుకోకుండా మాట్లాడే మాటలు సమస్యను మరింత పెద్దవి చేస్తాయి . ఈ పొరపాటు జరగకుండా చూసుకోవటం చాల అవసరం .

*పొరపాటు ఎవరి వల్ల జరిగిన ముందుకు వచ్చి పరిష్కరించే చొరవను కూడా ఎవరో ఒకరు తీసుకోవాలి .ఇలా చేయకపోతే ఇద్దరి మధ్యలోదూరం'పెరిగిపోతుంది .

*గొడవలు( problems )ముగిసాక ఒకరికి ఒకరు సారీ చెప్పుకుంటే మంచిది. ఆతర్వాత గడిపే క్షణాలు ముందు గొడవ తాలూకు చికాకులను దూరం చేస్తాయి .

*వాదించే వ్యక్తులు కనుక భాగస్వామిగా ఉన్నపుడు అవతలి వ్యక్తి సాధ్యమైనంత మౌనం పాటిస్తే గొడవ పెద్దది కాకుండా ఉంటుంది .

గొడవల్లో జరిగే పొరపాట్ల వల్ల విలువలు కోల్పోకుండా మాట్లాడుకోవడం ,ముఖ్యంగా దూషించే మాటలు ,నిందించే మాటలు,
గతానికి సంబందించిన మాటలు వంటివి గొడవ పెద్దది కావటానికి కారణాలు అవుతుంటాయి .

*గొడవ జరిగిన తర్వాత గొడవలో ఏ విషయాలు ఎవరిని భాదపెట్టాయో ఒకరికి ఒకరు తెలుసుకొని అర్ధం చేసుకున్నట్లైతే తిరిగి గొడవ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది .

*తెగే వరకు దేన్నీ లాగకపోవడం మంచిది ఏది రిలేషన్( relation ) కొనసాగించాలి అనుకొనే ప్రతిఒక్కరు తెలుసుకోవాల్సిన విషయంగా భావించాలి .

*గొడవలు రానీ రిలేషన్ ( relation ) ఎక్కడ ఉండవు . కానీ వాటి నుండి మనము సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి కానీ తెంచుకొనేలా పెంచుకోకూడదు ఎలాంటి రిలేషన్ లో అర్థంచేసుకోవటం నమ్మకం రెండు పునాదులు అని తెలుసుకోవాలి .

Updated On 1 April 2023 4:48 AM GMT
Ehatv

Ehatv

Next Story