Director Maruthi In Home Town Village : డైరెక్టర్ మారుతి చిన్ననాటి జ్ఞాపకాలు, 100ఏళ్ల బార్బర్ ను పరిచయం చేసిన దర్శకుడు
చాలా కాలం తరువాత సొంత ఊరు వెళ్ళారు డైరెక్టర్ మారుతి(Director Maruthi). చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. చాలా కాలం తరువాత తన హోమ్ టౌన్(Home Town) మచిలీపట్నం(Machilipatnam) వచ్చిన మారుతీ..
చాలా కాలం తరువాత సొంత ఊరు వెళ్ళారు డైరెక్టర్ మారుతి(Director Maruthi). చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. చాలా కాలం తరువాత తన హోమ్ టౌన్(Home Town) మచిలీపట్నం(Machilipatnam) వచ్చిన మారుతీ.. అక్కడ ఓ వ్యక్తిని పరిచయంచేశాడు.
ఊరు వదిలి వెళ్ళినవారికి చాల కాలం తరువాత సొంత ఊరికి వెళ్తే..చిన్ననాటి మధురానుభూతులు వెంటాడుతూనే ఉంటాయి. చిన్ననాటి జ్ఞాపకాలు వెంటే వస్తుంటాయి. అది సామాన్యులకు అయినా.. సెలబ్రిటీలకు అయినా ఒకే రకంగా ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆ అనుభూతులను నెమరువేసుకుంటున్నారు డైరెక్టర్ మారుతి. ఆఫీలింగ్ ను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో కలిసి పచుకున్నారు స్టార్ డైరెక్టర్. తన సొంత ఊరు మచిలీపట్నం వచ్చిన ఆయన చిన్ననాటి విషయాలు గుర్తు తెచ్చుకున్నారు. అభిమానులతో సోషల్ మీడియాలో శేర్ చేసుకున్నారు.
రీసెంట్ గా డైరెక్టర్ మారుతి తన సొంత ఊరు మచిలీపట్నం వెళ్ళాడు. అక్కడ తనకు ఇష్టమైన ప్లేస్ లు చూసుకుంటూ..తన చిన్ననాటి వ్యక్తులనుకలుసుకుంటూ.. జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. గడిపేశారు. అంతే కాదు అక్కడ ఓ వ్యాక్తిని కూడా ఆయన పరిచయం చేశారు. తాను చిన్నప్పుడు కటింగ్ చేయించుకున్న బార్బర్ ను కలిసి ఆయనతో ముచ్చటించారు. ఆయన ఫోటోని ప్రత్యేకంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు మారుతి. పోస్ట్ లో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా ఆయన రాసుకోచ్చారు.
ఈయన పేరు సీతారామారావు.ఇప్పుడు ఈయనకు 100 ఏళ్ళు ఉంటాయి. మా ఊళ్లో ఆయన ను 100 ఏళ్ళ బార్బర్ అంటారు. మా తాతయ్యకు, మా నాన్నకు, నాకు కూడా కటింగ్ చేశారు. నా చిన్నప్పుడు ఈయన దగ్గరే కటింగ్ చేయించుకున్నాను. ఈయన నా చిన్నప్పటి జ్ఞాపకం. ఈయన 100 ఏళ్ళు వచ్చినా ఇప్పటికి వర్క్ చేస్తున్నారు. ఈయన మరింత ఎక్కువ కాలం బతకాలి అని పోస్ట్ చేశారు. దాంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు మారుతి పోస్ట్ కు రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
ప్రస్తుతం మారుతీప్రభాస్ తో పాన్ ఇండియా రేంజ్ లో .. రాజా డీలక్స్ మూవీ చేస్తున్నాడు మారుతి. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా హిట్ అయితే.. మారుతి పేరు బాలీవుడ్ రేంజ్ లో మారుమోగబోతుంది.
He is Seetharama Rao 100 years barbar at our home town #Machilipatam ( Patha Ramanna peta) he did hair cutting for my grandfather my father & me also
He is a childhood memory ,
Still he is working at the age of 100
Great inspiration & Long live Seetha Rama Rao garuShare this pic.twitter.com/IIWRS91vqw
— Director Maruthi (@DirectorMaruthi) April 10, 2023