అందాలతార జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీదేవి (Sridevi) కూతురుగా ఆమె వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానాన్ని నిర్మించుకుంది. మొదటి చిత్రం ధడక్‌తోనే ప్రేక్షకులను అలరించిన జాన్వీ కపూర్‌ లాస్టియర్‌ బవాల్‌ సినిమాలో నటించింది. లేటెస్ట్‌గా తెలుగులో ఎన్టీఆర్‌(NTR)కు జంటగా దేవర (Devara)సినిమాలో నటిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన జాన్వీ కపూర్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా దేవర గ్లింప్స్ ఈనెల 8న రిలీజ్ చేయనున్నట్లు క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది చిత్ర యూనిట్‌. ఇటీవల కాఫీ విత్‌ కరణ్‌ (Koffee With Karan)షోకు హాజరయ్యింది జాన్వీ.

అందాలతార జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శ్రీదేవి (Sridevi) కూతురుగా ఆమె వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో తనకంటూ ఓ స్థానాన్ని నిర్మించుకుంది. మొదటి చిత్రం ధడక్‌తోనే ప్రేక్షకులను అలరించిన జాన్వీ కపూర్‌ లాస్టియర్‌ బవాల్‌ సినిమాలో నటించింది. లేటెస్ట్‌గా తెలుగులో ఎన్టీఆర్‌(NTR)కు జంటగా దేవర (Devara)సినిమాలో నటిస్తున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన జాన్వీ కపూర్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా దేవర గ్లింప్స్ ఈనెల 8న రిలీజ్ చేయనున్నట్లు క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది చిత్ర యూనిట్‌. ఇటీవల కాఫీ విత్‌ కరణ్‌ (Koffee With Karan)షోకు హాజరయ్యింది జాన్వీ. తన చెల్లెలు ఖుషి కపూర్‌(Khushi Kapoor,)తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఎపిసోడ్‌ ప్రొమో రిలీజ్‌ చేశారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది జాన్వీ. కరణ్‌ జోహార్‌ (Karan Johar)అడిగిన ప్రశ్నలకు జాన్వీ, ఖుషి కపూర్‌లు చక్కటి సమాధానాలు ఇచ్చారు. నీ స్పీడ్ డయల్‌ నంబర్స్‌లో ముగ్గురి పేర్లు చెప్పమని జాన్వీ కపూర్‌ను కరణ్ జోహార్ అడిగాడు. దానికి జాన్వీ సమాధానమిస్తూ పాపా(నాన్న), ఖుషు, శిక్కు అని చెప్పింది. శిక్కు పేరు వినగానే ఖుషీ, కరణ్ ఆశ్చర్యంగా జాన్వీ వైపు చూశారు. అంటే నటుడు శిఖర్ పహారియాతో జాన్వీ కపూర్‌ డేటింగ్‌లో ఉన్న విషయం నిజమేనన్నమాట! గతంలో చాలాసార్లు జాన్వీ కపూర్, శిఖర్ పహారియా (Shikhar Pahariya) జంటగా కనిపించారు. కానీ తమ రిలేషన్‌పై ఎక్కడా చెప్పలేదు. శిఖర్ ఎవరో కాదు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు.

Updated On 1 Jan 2024 6:19 AM GMT
Ehatv

Ehatv

Next Story