Hyderabad in Danger : ఢిల్లీ బాటలో హైదరాబాద్.. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మన మహానగరం ఢిల్లీలా(Delhi) తయారవుతుంది. ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. దక్షిణ భారతంలో(South India) అత్యంత కాలుష్య మెట్రో నగరంగా హైదరాబాద్ మారిందని గ్రీన్ పీస్ ఇండియా(Green Peace India) లేటెస్ట్ రిపోర్ట్‌లో తెలిపింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి వంటి దక్షిణ భారత మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం స్థాయిని తెలుసుకోవడానికి గ్రీన్‌పీస్ ఆఫ్ ఇండియా సంస్థ ఒక సర్వే నిర్వహించింది.
ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా మన మహానగరం ఢిల్లీలా(Delhi) తయారవుతుంది. ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. దక్షిణ భారతంలో(South India) అత్యంత కాలుష్య మెట్రో నగరంగా హైదరాబాద్ మారిందని గ్రీన్ పీస్ ఇండియా(Green Peace India) లేటెస్ట్ రిపోర్ట్‌లో తెలిపింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి వంటి దక్షిణ భారత మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం స్థాయిని తెలుసుకోవడానికి గ్రీన్‌పీస్ ఆఫ్ ఇండియా సంస్థ ఒక సర్వే నిర్వహించింది. ఇతర నగరాల కంటే హైదరాబాలో(Hyderabad) వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్నట్టు రుజువయ్యింది. హైదరాబాద్‌లో 2.5 పీఎం కాలుష్య కారకాలు ఉన్నట్టు వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే హైదరాబాద్ నగరంలో కాలుష్యం 14 రెట్లు అధికంగా విడుదలవుతున్నది. ప్రపంచ వాయు నాణ్యత సూచీలో కాలుష్య నగరాల జాబితాలో హైదరాబాద్ చేరడం భయాందోళనకు గురి చేస్తోంది. బంజారాహిల్స్‌లో(banjara hills) 127, కూకట్‌పల్లి(Kukatpally) హౌజింగ్‌బోర్డులో 124, జూపార్క్‌లో 144, సైదాబాద్‌లో 100 ఏసీఐలకు వాయుకాలుష్యం చేరుకున్నది. పరిశ్రమలు ఎక్కువగా ఉన్న మల్లాపూర్, నాచారం, బాలానగర్, పటాన్‌చెరు, పాశమైలారం ప్రాంతాల్లోనూ ఇటీవల వాయుకాలుష్యం అనూహ్యంగా పెరిగింది. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో న్యూఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత కోల్‌కతా(Kolkata), హైదరాబాద్ ఉన్నాయి. ముంబాయి(Mumbai) కంటే హైదరాబాద్ వాయుకాలుష్యం ఎక్కువగా ఉండటం గమనార్హం. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 7 వేల మెట్రిక్ టన్నుల చెత్త విడుదలవుతుండటంతో అధికంగా కాలుష్యం పెరుగుతున్నదని గ్రీన్ పీస్ ఇండియా సంస్థ తన సర్వే నివేదికలో తెలిపింది.