బతికుండగానే కూతురుకు సంతాప కార్యక్రమాలు నిర్వహించారు తల్లిదండ్రులు.. రాజస్థాన్‌లోని భీల్వాడాలో ఈ ఘటన జరిగింది. ఎందుకా పని చేశారంటే కూతురుపై ఉన్న కోపం.. ఆ కోపానికి కారణమేమిటంటే ఇంట్లో చెప్పకుండా ప్రియుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం. రతన్‌పురా గ్రామానికి చెందిన ప్రియ జాట్‌ తన కుటుంబసభ్యుల అనుమతి లేకుండా తను ప్రేమిస్తున్న యువకుడితో వెళ్లిపోయింది.

బతికుండగానే కూతురుకు సంతాప కార్యక్రమాలు నిర్వహించారు తల్లిదండ్రులు.. రాజస్థాన్‌లోని భీల్వాడాలో ఈ ఘటన జరిగింది. ఎందుకా పని చేశారంటే కూతురుపై ఉన్న కోపం.. ఆ కోపానికి కారణమేమిటంటే ఇంట్లో చెప్పకుండా ప్రియుడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకోవడం. రతన్‌పురా గ్రామానికి చెందిన ప్రియ జాట్‌ తన కుటుంబసభ్యుల అనుమతి లేకుండా తను ప్రేమిస్తున్న యువకుడితో వెళ్లిపోయింది. దీంతో యువతి కుటుంబసభ్యులు హమీర్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌లో కంప్లయింట్‌ చేశారు. కూతురు అదృశ్యమయ్యిందని చెప్పారు. వారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతి కోసం వెతకడం మొదలు పెట్టారు. చివరకు ఎలాగోలా ఆమె ఆచూకి తెలుసుకున్నారు. ఆమెను కుటుంబసభ్యుల దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ యువతి మాత్రం తాను ఇంటికి తిరిగి వెళ్లేది లేదని తెగేసి చెప్పింది. కుటుంబసభ్యులతో మాట్లాడేది లేదని చెప్పింది. కూతురు ఇలాంటి కఠన నిర్ణయం తీసుకున్న తర్వాత కుటుంబసభ్యులు మాత్రం ఆమె కోసం ఎందుకు పాకులాడుతారు? వారు కూడా కఠిన నిర్ణయమే తీసుకున్నారు. తమ కూతురు చనిపోయిందనుకుంటామని చెప్పారు. పది మందికి ఈ విషయం తెలియడానికి ఓ కండోలన్స్‌ మెసేజ్‌ను కూడా ప్రచురించారు. అందులో తమ కూతురు జూన్‌ 1వ తేదీన చనిపోయిందని, జూన్‌ 13వ తేదీన కూతురు దశ దిన కర్మలు జరుపుతున్నామని, అందరూ రావాల్సిందిగా విన్నవించుకున్నారు. అయితే ఈ సంతాప సందేశం కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు తలోతీరుగా స్పందిస్తున్నారు. స్థానికులు మాత్రం ఇదేం చోద్యమని అనుకుంటున్నారు.

Updated On 5 Jun 2023 3:53 AM GMT
Ehatv

Ehatv

Next Story