విడాకులు(Divorce) తీసుకున్న తర్వాత కూడా భార్యపై శాడిజాన్ని ప్రదర్శించబోయాడో భర్త.. భార్యను మానసికంగా వేధించాలనుకున్న అతడి పన్నాగాన్ని కోర్టు(court) పసిగట్టింది. అతడికి గట్టిగానే బుద్ధి చెప్పింది. అసలేం జరిగిదంటే.. రాజస్థాన్‌లోని(Rajasthan) హర్మదా(Harmada) ప్రాంతానికి చెందిన దశరథ్‌ కుమావత్‌(Dasharath Kumawat), సీమ(seema) దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.

విడాకులు(Divorce) తీసుకున్న తర్వాత కూడా భార్యపై శాడిజాన్ని ప్రదర్శించబోయాడో భర్త.. భార్యను మానసికంగా వేధించాలనుకున్న అతడి పన్నాగాన్ని కోర్టు(court) పసిగట్టింది. అతడికి గట్టిగానే బుద్ధి చెప్పింది. అసలేం జరిగిదంటే.. రాజస్థాన్‌లోని(Rajasthan) హర్మదా(Harmada) ప్రాంతానికి చెందిన దశరథ్‌ కుమావత్‌(Dasharath Kumawat), సీమ(seema) దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. కలిసి కాపురం చేయడం కుదరదని భావించిన ఇద్దరూ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉంది.

అప్పటి వరకు సీమకు నెలకు అయిదు వేల రూపాయల చొప్పున నిర్వహణ ఖర్చుల(Montly Expenses) కింద ఇవ్వాలని న్యాయస్థానం దశరథ్‌ కుమావత్‌ను ఆదేశించింది. అయితే 11 నెలలుగా అతడా సొమ్మును ఇవ్వడం లేదు. దాంతో సీమ మళ్లీ కోర్టును ఆశ్రయించింది. దశరథ్‌పై కోర్టు రికవరీ వారెంట్‌ జారీ చేసింది. అయినప్పటికీ డబ్బు ఇవ్వడానికి ససేమిరా అనడంతో పోలీసులు జూన్‌ 17వ తేదీన అతడిని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఫ్యామిలీ కోర్టు సెలవులో ఉండటంతో దశరథ్‌ను అదనపు జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు పోలీసులు. దశరథ్‌ అరెస్ట్‌ కావడంతో అతడి కుటుంబసభ్యులు సీమకు చెల్లించాల్సిన డబ్బును ఏడు బస్తాలలో కోర్టుకు తెచ్చారు.

55 వేల రూపాయలకు సమానమైన రూపాయి, రెండు రూపాయల నాణేలను(coins) తెచ్చారు. ఆ సంచుల బరువు 280 కిలోల వరకు ఉంటాయి. ఆ డబ్బు తీసుకోవడానికి సీమ ఒప్పుకోలేదు. తనకు మెంటల్‌ టార్చర్‌ పెట్టడానికే ఇలా తీసుకొచ్చారని కోర్టుకు విన్నవించుకుంది. న్యాయమూర్తి మాత్రం కాయిన్స్‌ రూపంలో దశరథ్‌ డబ్బు చెల్లించవచ్చని చెప్పారు. కాకపోతే ఆ నాణేలన్నింటినీ అతడే స్వయంగా లెక్కించాలని ఆదేశించారు. కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిన జడ్జ్‌ అప్పటి వరకు డబ్బు కోర్టు ఆధీనంలోనే ఉంటుందని తెలిపారు. విచారణ తేదీ రోజున ఆ డబ్బును దశరథ్‌ లెక్కించి వెయ్యి రూపాయల చొప్పున ప్యాకెట్లుగా విభజించి, కోర్టులో
వాటిని భార్య సీమకు అప్పగించాలన్నారు.

Updated On 21 Jun 2023 12:39 AM GMT
Ehatv

Ehatv

Next Story