బ్రిటన్‌లోని(Britain) లూటన్‌(Luton) నుంచి ఇబిజాకు(ibiza) వెళుతున్న విమానంలో ఓ చిత్రమైన ఘటన జరిగింది. విమానం గాల్లో ఎగురుతున్న సమయంలోనే ఓ జంట బాత్‌రూమ్‌లో అభ్యంతరకర పరిస్థితిలో దొరికిపోయింది.

బ్రిటన్‌లోని(Britain) లూటన్‌(Luton) నుంచి ఇబిజాకు(ibiza) వెళుతున్న విమానంలో ఓ చిత్రమైన ఘటన జరిగింది. విమానం గాల్లో ఎగురుతున్న సమయంలోనే ఓ జంట బాత్‌రూమ్‌లో అభ్యంతరకర పరిస్థితిలో దొరికిపోయింది. ఈజీ జెట్‌(Easy Jet) సంస్థకు చెందిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు బాత్‌రూమ్‌లోకి వెళ్లి తలుపుపెట్టుకున్నారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో సిబ్బంది తలుపు తట్టి బయటకు రమ్మన్నారు. లోపలున్న జంట మాత్రం లైట్‌ తీసుకుంది. ఇక లాభం లేదనుకున్న సిబ్బంది బలవంతంగా తలుపు తెరిచాడు. లోపల కనిపించిన దృశ్యాన్ని చూసి బిత్తరపోయాడు. అతడే కాదు, ప్రయాణికులు కూడా అవాక్కయ్యారు. తర్వాత నవ్వుకున్నారు. ఇదంతా ప్రయాణికులలో ఒకరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విమానం ఇబిజాలో ల్యాండ్‌ అయిన తర్వాత ఆ జంటను పోలీసులకు అప్పగించామని ఈజీ జెట్‌ సంస్థ పేర్కొంది. అయితే పోలీసులు ఆ జంటపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదు.

Updated On 13 Sep 2023 6:05 AM GMT
Ehatv

Ehatv

Next Story