మీరెప్పుడైనా మెక్సికోకు(Mexico) వెళితే మాత్రం అక్కడున్న గువానాజువాటోకు(Guanajuato) తప్పకుండా వెళ్లండి.. ఒంటరిగా మాత్రం కాదు.. మీ భాగస్వామితోనో, మీ ప్రియురాలితోనో వెళ్లండి.. వెళ్లిన తర్వాత కిస్‌స్ట్రీట్‌ను(Kiss Street) చుట్టేసి రండి. అక్కడికి వెళ్లిన వారు ముద్దు(Kiss) పెట్టుకోకుండా వెనక్కిరారు.

మీరెప్పుడైనా మెక్సికోకు(Mexico) వెళితే మాత్రం అక్కడున్న గువానాజువాటోకు(Guanajuato) తప్పకుండా వెళ్లండి.. ఒంటరిగా మాత్రం కాదు.. మీ భాగస్వామితోనో, మీ ప్రియురాలితోనో వెళ్లండి.. వెళ్లిన తర్వాత కిస్‌స్ట్రీట్‌ను(Kiss Street) చుట్టేసి రండి. అక్కడికి వెళ్లిన వారు ముద్దు(Kiss) పెట్టుకోకుండా వెనక్కిరారు. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఆ ప్రాంతానికి వెళ్లి ముద్దులు పెట్టుకోవాలనుకుంటున్నారు జంటలు. అదో సంప్రదాయమో, ఆచారమో కాదు.. కేవలం ఓ నమ్మకం(trust)..

ఆ నమ్మకంతోనే చాలా జంటలు ఇక్కడకొచ్చి కిస్‌ స్ట్రీట్‌ దగ్గర క్యూలో నిల్చుంటాయి. చాలా ఇరుకైన గల్లీ అది. కేవలం ఒక జంట మాత్రమే అందులోకి వెళ్లే వీలుంటుంది. అందుకే అన్నమాట జంటలు క్యూలు కట్టేది. ఒక జంట తర్వాత మరొక జంట ఈ గల్లీలోకి వెళుతుంది. అక్కడ ముద్దులు పెట్టుకుని వెనక్కి వచ్చేస్తుంది. అన్నట్టు ఈ కిస్‌ స్ట్రీట్‌ను ఎలో ఆఫ్‌ ది కిస్‌(Elo of the kiss)అని కూడా అంటారు. ఈ ఇరుకైన సందుకు సంబంధించి ఓ విషాదంతమైన ప్రేమ కథ ఉంది. అనగనగా ఓ అమ్మాయ ఓ అబ్బాయి గాఢంగా ప్రేమించుకున్నారు.

ఇందులో ప్రేమికురాలు మాత్రం బాగా డబ్బున్న అమ్మాయి. ప్రియుడేమో పేదవాడు. అయినా తోటరాముడు, రాజకుమారిలా ప్రేమించుకున్నారు. రహస్యంగా ఇక్కడికి వచ్చి కిస్‌ చేసుకునేవారు. అయితే అమ్మాయి ఇంట్లో వాళ్లు వీరి ప్రేమపై పగపట్టారు. అమ్మాయిని అనేక రకాలుగా కట్టడి చేశారు. అయినా ఈ స్ట్రీట్‌కు వచ్చి ప్రియుడిని కలుసుకునేది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను హత్య చేశారు. ఫలితంగా ఆ ప్రేమ అక్కడితో ముగిసింది. అయితే వారి ప్రేమను కలకాలం జీవింపచేయడం(Relive) కోసం వేల జంటలు ఇక్కడికి వచ్చి ముద్దులు పెట్టుకుంటుంటాయి. ఈ గల్లీలో ముద్దు పెట్టుకునే జంటల మధ్య ప్రేమ పెరుగుతుందని స్థానికులు అంటుంటారు.

Updated On 26 Jun 2023 7:09 AM GMT
Ehatv

Ehatv

Next Story