విశ్వం అంతుతేల్చే పనిలో ముందుకు దూసుకుపోతున్న ఈ కాలంలో ఇంకా కొందరు మూఢనమ్మకాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. బయటకు వెళుతున్నప్పుడు ఎక్కడికెళుతున్నారని అడిగితే తప్పు.. పిల్లి ఎదురొస్తే తప్పు. తుమ్మితే తప్పు.. రాత్రిపూట గోళ్లు తీసుకుంటే తప్పు.. ఇలా తర్కానికి అందని నమ్మకాలు ఎన్నో.. చాలా మంది భారతదేశంలోనే ఇలాంటి నమ్మకాలు ఎక్కువగా ఉంటాయనుకుంటారు కానీ, చాలా దేశాల్లో అంధ విశ్వాసాలు ఉన్నాయి.

విశ్వం అంతుతేల్చే పనిలో ముందుకు దూసుకుపోతున్న ఈ కాలంలో ఇంకా కొందరు మూఢనమ్మకాల(Superstitions) ఉచ్చులో చిక్కుకుంటున్నారు. బయటకు వెళుతున్నప్పుడు ఎక్కడికెళుతున్నారని అడిగితే తప్పు.. పిల్లి ఎదురొస్తే తప్పు. తుమ్మితే తప్పు.. రాత్రిపూట గోళ్లు తీసుకుంటే తప్పు.. ఇలా తర్కానికి అందని నమ్మకాలు ఎన్నో.. చాలా మంది భారతదేశంలోనే ఇలాంటి నమ్మకాలు ఎక్కువగా ఉంటాయనుకుంటారు కానీ, చాలా దేశాల్లో అంధ విశ్వాసాలు ఉన్నాయి.

మనకు వింతగానూ, విచిత్రంగానూ అనిపించే అలాంటి కొన్ని మూఢనమ్మకాలను తెలుసుకుందాం! నైజీరియాలో(Nigeria) పిల్లల పెదవులపై(Lips) ముద్దు పెట్టరట! అలా పెడితే పెద్దయ్యాక వాళ్ల జీవితం నాశనం అవుతుందట! అలాగని గట్టిగా నమ్ముతుంటారు నైజీరియన్లు.

మనం తీరుబడిగా కుర్చీలో కూర్చున్నామనుకోండి. అప్రయత్నంగానే కాళ్లు ఊపుతుంటాం. చాలా మందికి ఇదో అలవాటు కూడా! ఇక్కడైతే చెల్లుతుంది కానీ ఇదే దక్షిణాఫ్రికాలో(south africa) చేస్తే మాత్రం అస్సలు ఒప్పుకోరు. ఖాళీగా కూర్చొని కాళ్లు ఊపితే ఆ వ్యక్తి సంపద మొత్తం తుడిచిపెట్టుకుపోతుందట! అందుకే అక్కడ కాళ్లు కదిపే వ్యక్తిని చాలా అసహ్యంగా చూస్తారు.

మన దగ్గర ఆరు బయట కూర్చొని కుట్లు, అల్లిక పనులు చేస్తుంటారు. ఐస్‌ల్యాండ్‌లో (Ice Land)మాత్రం ఇలా చేయరు. అలా చేస్తే చలికాలం మరింత కాలం కొనసాగుతుందని వారి నమ్మకం. మామూలు రోజుల్లోనే అక్కడ మైనస్‌ డిగ్రీల వాతావరణం ఉంటుంది. ఇక చలికాలం చెప్పనే వద్దు.. అందుకే ఐస్‌ల్యాండ్ వాసలకు చలికాలం అంటే అంత భయం! లాటిన్‌ అమెరికా(Latin America) దేశాలలో మంగళవారం అస్సలు పెళ్లి చేసుకోరు.

ఒకవేళ చేసుకున్నా ఆ పెళ్లి ఎక్కువ రోజులు ఉండదట. ప్రతి రోజూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ విడాకుల వరకు వెళతారట. పైగా మంగళవారాలు జరిగే పెళ్లిళ్లలకు ఎవరూ వెళ్లరట! జపాన్‌లో(Japan) ఉత్తర, పశ్చిమ(North and West) దిక్కుల వైపు చూస్తూ ఎవరూ పడుకోరట. జపాన్‌లో చనిపోయిన వారి తలలు ఉత్తరం వైపు చూస్తున్నట్టు ఉంచుతారు. ఆఫ్రికాలో పశ్చిమం వైపు చూస్తున్నట్టు ఉంచుతారు. జర్మనీలో(Germany) కొవ్వొత్తితో సిగరెట్‌ వెలిగించకూడదు.

రువాండలో (Rwanda)మహిళలు మేక(Goat) మాంసం తినరు. మేకమాంసం తింటే ముఖంపై వెంట్రుకలు వస్తాయన్నది వారి నమ్మకం. జపాన్‌లో సూర్యుడు అస్తమించిన తర్వాత చేతి గోళ్లను(Nails) కత్తించకూడదు. అలా కత్తిరించుకుంటే త్వరగా చనిపోతారట. ఈ నమ్మకం మన దగ్గర కూడా ఉంది. కాకపోతే మనం రాత్రిళ్లు గోళ్లు తీసుకుంటే అరిష్టమని భావిస్తాం. స్వీడన్‌లో(Sweden) పొరపాటున కూడా మాన్‌హోల్‌పై(Manholes) కాలు పెట్టరు.. మాన్‌హోల్‌ తెరుచుకుని అందులో పడిపోతామన్న భయం కాదు.. మాన్‌హోల్‌పై కాలుపెడితే ప్రేమ విఫలం అవుతుందట.

Updated On 20 Jun 2023 5:08 AM GMT
Ehatv

Ehatv

Next Story