ఈ మధ్య హార్ట్ ఎటాక్ మరణాలు అందరిని కలవరపెడుతున్నాయి. సడెన్ గా వచ్చే ఈ మాయదారి గుండెనొప్పి యువకుల్ని , పిల్లల్ని సైతం వదిలి పెట్టడం లేదు . అయితే ఇప్పుడు అందరిలోనూ ఓ అనుమానం వెంటాడుతోంది. కోవిడ్ వాక్సినేషన్ వేయించుకోవడం వల్లనే ఈ హఠాన్మారణాలు సంభవిస్తున్నాయనేది ప్రచారం అవుతోంది. దీనిపై మరి డాక్టర్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం . ఒకప్పుడు గుండె జబ్బులు వయస్సు మళ్లిన వారికే వచ్చేవి .... .అవి కూడా చాలా తక్కువ మంది […]

ఈ మధ్య హార్ట్ ఎటాక్ మరణాలు అందరిని కలవరపెడుతున్నాయి. సడెన్ గా వచ్చే ఈ మాయదారి గుండెనొప్పి యువకుల్ని , పిల్లల్ని సైతం వదిలి పెట్టడం లేదు . అయితే ఇప్పుడు అందరిలోనూ ఓ అనుమానం వెంటాడుతోంది. కోవిడ్ వాక్సినేషన్ వేయించుకోవడం వల్లనే ఈ హఠాన్మారణాలు సంభవిస్తున్నాయనేది ప్రచారం అవుతోంది. దీనిపై మరి డాక్టర్స్ ఏమంటున్నారో తెలుసుకుందాం .

ఒకప్పుడు గుండె జబ్బులు వయస్సు మళ్లిన వారికే వచ్చేవి .... .అవి కూడా చాలా తక్కువ మంది వీటి బారిన పడేవారు . కానీ ఇప్పుడు ఇవి ఎవరిని వదలడం లేదు ..చివరకు యువకుల్ని సైతం వెంటాడుతున్నాయి. అయితే చెస్ట్ లో వచ్చే ప్రతి నొప్పి గుండెపోటు అని అదైర్యపడకండి.. కొంతమందిలో ఇది అసిడిటి వల్ల కూడా రావచ్చు.. అలా అని కేర్ లెస్ గా ఉండటం వల్ల ప్రాణాలకే ముప్పు రావచ్చు . చెస్ట్ పెయిన్ తో పాటు , ఎడమభుజం , దవడల వద్ద పెయిన్ రావడం ..చెమటలు పట్టడం, అది హార్ట్ ఎటాక్ అని గుర్తించాలి.

అయితే మరోవైపు ఈ హార్ట్ఎ‌టాక్‌లకు కరోనా సమయంలో వేయించుకున్న కోవిషీల్డ్ వ్యాక్సినే కారణం అనే ప్రచారం జోరుగా ఉంది. దీనిపై మనీకంట్రోల్ సంస్థ.. దేశంలోని ప్రముఖ కార్డియాలజీస్టులు వారి వారి అభిప్రాయాలు తెలిపారు. "హార్ట్ ఎటాక్స్ పెరగడానికి వ్యాక్సిన్లు కారణం అనడానికి ఖచ్చితమైన కారణం లేదు .. ఇందుకు వ్యాక్సిన్లు అని ప్రచారం కరెక్ట్ కాదు గానీ .. కోవిడ్ ఇన్ఫెక్షన్ల వల్ల హార్ట్ఎటాక్స్ పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. కరోనా సోకినప్పుడు ట్రీట్‌మెంట్ కోసం వాడిన స్టెరాయిడ్స్ వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రీట్‌మెంట్ చేసిన సంవత్సరం తర్వాత ఇలా జరిగే ఛాన్స్ ఉంది" అని డాక్టర్ బల్బీర్ తెలిపారు.

"తీవ్రమైన కోవిడ్ వల్ల సైటోకిన్ స్టోర్మ్ అనే కండీషన్ ఏర్పడుతుంది. సైటోకిన్ స్మోర్మ్ అనేది.. వ్యాధి నిరోధక శక్తి నుంచి వచ్చే ప్రతి తీవ్ర చర్య. దీని వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె లయతప్పడం వంటివి జరుగుతాయి. చాలా మంది దీని నుంచి కోలుకోగలరు" అని డాక్టర్ కీర్తి సాబ్నిస్ తెలిపారు. "తీవ్రమైన కోవిడ్ వల్ల డయలేటెడ్ కార్డియోమయోపతి వస్తుంది. ఇది వచ్చినప్పుడు గుండె కండరాలు బలహీనం అవుతాయి. ఇలా అయితే మాత్రం కోలుకునే అవకాశం ఉండదు. ఐతే.. లక్షణాలు కనిపించకుండా ఇలా జరగదు. ముందుగానే లక్షణాలు కనిపిస్తాయి" అని వివరించారు.

Updated On 6 March 2023 4:41 AM GMT
Ehatv

Ehatv

Next Story