ప్రతి రంగులో(Color) ఓ ఎనర్జీ ఉంటుంది. తెలియని భావం అందిస్తూ, గొప్ప శక్తి కలిగి ఉండే రంగుల్ని మనం ఎలా వాడుకోవాలి. అంటే.. వేసుకున్న డ్రెస్ కలర్‌ని బట్టి కూడా.. మనిషిలోని వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. మనిషి హావభావాలను రంగులు చెప్పేస్తుంటాయి.

ప్రతి రంగులో(Color) ఓ ఎనర్జీ ఉంటుంది. తెలియని భావం అందిస్తూ, గొప్ప శక్తి కలిగి ఉండే రంగుల్ని మనం ఎలా వాడుకోవాలి. అంటే.. వేసుకున్న డ్రెస్ కలర్‌ని బట్టి కూడా.. మనిషిలోని వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది. మనిషి హావభావాలను రంగులు చెప్పేస్తుంటాయి. చాలా రంగులకు జబ్బుల్ని నయంచేసే గుణం ఉంటుందని కూడా మనం అప్పుడప్పుడు చదువుతుంటాం. నిజానికి దాన్నే కలర్ థెరపీ అంటారు. మరి రంగులు మన జీవిత గమ్యాన్ని.. భవిష్యత్‌ని నిర్ణయిస్తాయా? మారుస్తాయా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది? ఇదంతా నిజమేనని నమ్మేవారు.. ఏ వారం ఏ రంగు బట్టలు వేసుకోవాలి? ఇప్పుడు చూద్దాం.

ఆదివారం(sunday)
వారాల్లో మొదటి రోజు. చాలా మంది ఈ రోజుని రవివారం అని కూడా అంటారు. ఈ రోజు సూర్యభగవాణుడ్ని ప్రార్థిస్తాం. ఈ రోజు గులాబీ(Pink) వర్ణం కలిసిన దుస్తుల్ని ధరిస్తే మంచిదట. అంతా మంచే జరుగుతుందట.

సోమవారం(monday)
వారంలో రెండొవ రోజు.. శివారాధన ఎక్కువగా చేస్తుంటాం. ఈ రోజు తెల్లటి(white) వస్త్రాలు ధరించాలనేది జ్యోతిష్యుల మాట.

మంగళవారం(tuesday)
ఇది హనుమంతుడి రోజు. కాబట్టి కాషాయ(Orange) వర్ణాతో కలిగిన దుస్తుల్ని వేసుకోవాలట. సిందూరం లేదా ఎరుపు రంగు వస్త్రాలు మంచి ఫలితాలను ఇస్తాయట.

బుధవారం(wednesday)
విఘ్నేశ్వరుని పూజలు ఎక్కువగా చేస్తుంటాం. ఆయనకు ఆకు పచ్చ(green) రంగు అంటే చాలా ఇష్టమట. అందుకే ఆ రోజు పచ్చ వర్ణంలో ఉన్న దుస్తులు ధరించాలని చెబుతారు జ్యోతిష్కులు.

గురువారం(thursday)
సాయినాదుడికి ఈ రోజు మహా ప్రీతి. అందుకే పసుపు(Yellow) రంగుల్ని వాడితే మంచిది.

శుక్రవారం(friday)
ఇది దేవి మాత రోజు. ఆమె సర్వాంతర్యామి కావున అన్ని రంగుల మిశ్రమంతో ఉన్న దుస్తుల్ని ధరిస్తే శుభసూచకం.

శనివారం(saturday)
శనిదేవుడికి సమర్పించే ఈ రోజున.. నలుపు(Black) లేదా నీలి(blue) రంగు దుస్తులు ధరించడం మంచిది.

నిజానికి కొన్ని రంగులు మనకు చాలా నచ్చుతుంటాయి. తెలియకుండానే కొన్ని రంగుల పట్ల ఆకర్షితులం అవుతుంటాం. దాన్నే కలర్ సైన్స్ అంటారు. కానీ జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మేవారు రోజులను అనుసరించి.. రంగుల్ని పాటిస్తూ.. ధరిస్తూ ఉంటారు. అయితే కొందరి పండితుల సూచనలతో ఈ మొత్తం వివరాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి విషయాల్లో మరింత సమగ్ర సమాచారం కోసం మీ సమీపంలోని పూజారుల సలహాలు తీసుకుని పాటించడం మంచిది.

Updated On 19 April 2023 12:56 AM GMT
Ehatv

Ehatv

Next Story