✕
Best winter vacation spots : వింటర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..
By EhatvPublished on 12 Dec 2023 5:11 AM GMT
ఇతర దేశాల్లోనే కాదు భారత దేశంలో(Bharat) కూడా చల్లని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. భారత దేశంలో టూరిస్టులను(Tourists) ఆకట్టుకునే ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. డిసెంబర్(December) నుంచి ఫిబ్రవరి(February) మధ్య వింటర్(Winter) టూర్ ప్లాన్ చేసుకోవాలంటున్నారు . పని ఒత్తిడి(Stress) నుంచి విశ్రాంతి తీసుకొని కుటుంబం, స్నేహితులతో(Friends) టూర్‌కు వెళ్లాలని చాలా మంది అనుకొంటుంటారు. అయితే ఈ వింటర్లో మీరు టూర్‌కు ప్లాన్ చేస్తే.. మంచి మంచి లొకేషన్లు ఏంటో చూద్దాం..!

x
poster
-
- ఉత్తర భారతదేశంలోని(North India) పలు ప్రాంతాల్లో శీతాకాలంలో చలిగాలులు వీస్తాయి. కశ్మీర్(Kashmir), హిమాచల్‌ప్రదేశ్‌లలో(himachal Pradesh) మంచు వర్షం కురుస్తోంది. మన దేశంలో మంచు కురిసే ప్రదేశం ఏంటని అడిగితే మొదటగా గుర్తొచ్చేది కశ్మీర్. మంచు (Snow)ప్రేమికులు కశ్మీర్‌ను తప్పక చూడాలంటున్నారు. శ్రీనగర్‌లోని చష్మే షాహీ గార్డెన్(Chashme Shahi), నిగీన్ లేక్(Nigeen Lake), దౌలత్ పార్క్, దాల్ లేక్ ఇలా ఎన్నో చూడదగ్గ ప్రదేశాలున్నాయి.
-
- ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లోని గుల్మార్గ్(Gulmarg) సందర్శకులను కట్టిపడేస్తుంది. గడ్డకట్టిన సరస్సులు, మంచుతో కప్పబడే ప్రదేశాలు చాలా అహ్లాదకరంగా ఉంటాయంటున్నారు. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కేబుల్ కార్ సర్వీస్(Cable car service) ఉంది. మంచుకురుస్తుండడంతో క్రిస్మస్, డిసెంబర్ 31 వేడుకలు నిర్వహించుకునేందుకు వేలాది మంది పర్యాటకులు వస్తారంటున్నారు.
-
- ఇక హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఉన్న మనాలి(Manali) కూడా చుడదగ్గ ప్రదేశం. ఎత్తైన మంచు పర్వతాలు, లోయలతో టూరిస్టులకు మంచి స్పాట్ అని చెప్తుంటారు. మనాలీ దగ్గరే ఉన్న షోలాంగ్ వ్యాలీ(Solang Valley), రోహ్తంగ్ పాస్‌లో మంచు కురవడంతో వింటర్ టూర్‌ను ఎంజాయ్ చేయొచ్చని చెప్తున్నారు. అయితే రోహతంగ్పాస్(Rohtang Pass) మాత్రం వింటర్లో క్లోజ్ చేస్తారు.
-
- పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే మరో ప్రదేశం సిమ్లా(Shimla). చలికాలంలో పర్వతాలు, రోడ్లు, ఇళ్లు, దుకాణాలు మంచు దుప్పటి కప్పుకుంటాయి. బ్రిటీష్(British) హయాంలో సిమ్లా వేసవి రాజధానిగా(Summer capital) ఉండేది. వింటర్లో సిమ్లా టూర్ వేస్తే ఆ ఆనందమే వేరంటున్నారు పర్యాటకులు.
-
- హిమాచల్‌ప్రదేశ్‌లోని తీర్థన్ వ్యాలీ(Tirthan Valley) కూడా పర్యాటక రంగానికి పెట్టింది పేరు. కులుజిల్లాలోని తీర్థన్ వ్యాలీ దగ్గర ప్రశాంతమైన వాతావరణం, అడవులు(Forest), ప్రకృతి సౌందర్యం, అహ్లాదకర జీవనశైలి ఉండడంతో ఇక్కడ హాయిగా గడుపొచ్చని పర్యాటకులు అంటారు. తీర్థన్ లోయకు దగ్గరలోనే హిమాలయన్ నేషనల్ పార్క్(Himalayan National Park) ఉంటుంది. దీనికి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు వచ్చింది.

Ehatv
Next Story