తమిళనాడు(tamilnadu) కోయంబత్తూరు(Coimbatore) నగర ప్రైవేటు బస్సులో తొలి మహిళా డ్రైవర్‌గా(woman Driver) ప్రశంసలు అందుకుంటున్న 24 ఏళ్ల షర్మిల ఉద్యోగం ఊడింది. ఆమె నడిపిన బస్సులో ఎంపీ కనిమెళి(MP kanimouli) ప్రయాణించిన కొన్ని గంటల్లోనే షర్మిల ఉద్యోగాన్ని కోల్పోయింది.. ఈ మధ్యలో ఏం జరిగింది? ఎందుకామె ఉద్యోగం పోయింది? వివరంగా తెలుసుకుందాం!
బస్సు డ్రైవర్‌ షర్మిల(Driver sharmila) కోయంబత్తూరులోనే కాదు, తమిళనాడు అంతటా ఫేమస్‌!

తమిళనాడు(tamilnadu) కోయంబత్తూరు(Coimbatore) నగర ప్రైవేటు బస్సులో తొలి మహిళా డ్రైవర్‌గా(woman Driver) ప్రశంసలు అందుకుంటున్న 24 ఏళ్ల షర్మిల ఉద్యోగం ఊడింది. ఆమె నడిపిన బస్సులో ఎంపీ కనిమెళి(MP Kanimozhi) ప్రయాణించిన కొన్ని గంటల్లోనే షర్మిల ఉద్యోగాన్ని కోల్పోయింది.. ఈ మధ్యలో ఏం జరిగింది? ఎందుకామె ఉద్యోగం పోయింది? వివరంగా తెలుసుకుందాం!
బస్సు డ్రైవర్‌ షర్మిల(Driver sharmila) కోయంబత్తూరులోనే కాదు, తమిళనాడు అంతటా ఫేమస్‌! ఆమె బస్సు నడిపే విధానం సోషల్ మీడియాలలో వైరల్‌ కావడంతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయ్యారు. చాలా మంది అమ్మాయిలు తమకు షర్మిల ఆదర్శమంటూ(Inspiration) స్టేట్‌మెంట్లు ఇచ్చారు. తాము కూడా డ్రైవింగ్‌ నేర్చుకుని బస్సులను నడిపేస్తామన్నారు. ఇదే సమయంలో షర్మిలతో సెల్ఫీలు దిగేందుకు వచ్చేవారు ఎక్కువయ్యారు. షర్మిల డ్రైవింగ్‌ సంగతి ఆ నోటా ఈ నోటా విన్న డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) ఆమె పని తీరు ఎలా ఉందో ప్రత్యక్షంగా తెలుసుకోడానికి శుక్రవారం కొయంబత్తూరుకు వచ్చారు.

కళిమొళి వస్తున్నారని తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు కానీ షర్మిల నడిపే బస్సులో అప్పటి వరకు ఉన్న మగ కండక్టర్‌ను తొలగించి కొత్తగా లేడి కండక్టర్‌ను(Lady conductor) ప్రవేశపెట్టింది ఆ ట్రావెల్స్‌ యాజమాన్యం. ఇక అప్పట్నుంచి ఆ లేడి కండక్టర్‌ రూపంలో షర్మిలకు ఇబ్బందులు రావడం మొదలయ్యాయి. తన బస్సులోకి కళిమొళితో పాటు మరికొందరు ఎక్కడంతో షర్మిల ఆనందించింది. బస్సు నడుపుతూనే కనిమొళితో ముచ్చటించింది. తన కుటుంబం గురించి చెప్పుకుంది. షర్మిల బస్సు నడిపే తీరు కనిమొళికి బాగా నచ్చింది. ఆమెను అభినందించింది. ఇంతలోనే ఆ లేడి కండక్టర్‌ టికెట్‌కు డబ్బులు ఇవ్వాల్సిందేనని కనిమొళితో పాటు ఆమెతో వచ్చిన వారిపై ఒత్తిడి తెచ్చిందట! తనకోసం కనిమొళి వచ్చారు కాబట్టి టికెట్‌ డబ్బులు తానే ఇస్తానంటూ కండక్టర్‌తో షర్మిల చెప్పింది.

అయినా ఆ లేడి కండక్టర్‌ వినిపించుకోకుండా దూకుడుగా వ్యవహరించింది. దీంతో తర్వాతి స్టాప్‌లో కనిమొళితో పాటు మిగిలిన వారు కూడా బస్సు దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ గాంధీపురం స్టాప్‌లో(Gandhi Puram Stop)బస్సును ఆపేసింది షర్మిల. బస్సు దిగి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ట్రావెల్స్‌ యజమాని తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని, తనను ఉద్యోగంలోంచి తీసేశారంటూ షర్మిల ఆవేదనగా చెప్పడం మీడియాలో వైరల్‌ అయ్యింది. బస్సు యజమాని దురై వెర్షన్ మాత్రం మరోలా ఉంది. షర్మిలకు వ్యకిగత పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందని, అయినప్పటికీ తాము ఆమెను భరిస్తున్నామని, ఆమెను ఉద్యోగంలోంచి తొలగించామని వస్తున్న వార్తల్లో నిజం లేదని దురై(Durai) చెప్పారు. అయితే ఈ వ్యవహారం మొత్త కనిమొళి దృష్టికి వెళ్లింది. షర్మిలతో ఆమె వ్యక్తిగత సహాయకులు మాట్లాడరట! షర్మిలకు కనిమొళి కొత్త ఉద్యోగం ఇప్పిస్తారేమో!

Updated On 24 Jun 2023 2:00 AM GMT
Ehatv

Ehatv

Next Story