✕
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఒకేసారి సీఎం మార్పు?
By ehatvPublished on 11 March 2025 7:36 AM GMT
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఒకేసారి సీఎం మార్పు?

x
త్వరలోనే తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకే.. మీనాక్షి నటరాజన్‌ను అనూహ్యంగా రంగంలోకి దింపారని సమాచారం. అటు.. కేబినెట్ విస్తరణతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ రేవంత్ రెడ్డి సిఫార్సులను కనీసం కాంగ్రెస్ అధిష్టానం పరిగణనలోకి తీసుకోలేదని రేవంత్ వ్యతిరేక వర్గం ప్రచారం చేయిస్తోంది. సైలెంట్‌గా రేవంత్‌ను పక్కకు నెట్టేసి.. మరొకరిని సీఎం చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు.. కర్ణాటకలోనూ డీకే శివకుమార్‌కి సీఎం పీఠం దక్కే ఛాన్స్ ఉందని.. సిద్ధరామయ్యను త్వరలోనే సీటు నుంచి తప్పించనున్నారని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ముఖ్యమంత్రులను మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారట.

ehatv
Next Story