నటి త్రిషపై(Trisha) తమిళ నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ (Mansoor ali khan) చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే చాలా మంది మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ త్రిషకు మద్దతుగా నిలిచారు.

నటి త్రిషపై(Trisha) తమిళ నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ (Mansoor ali khan) చేసిన అనుచిత వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న విషయం తెలిసిందే! ఇప్పటికే చాలా మంది మన్సూర్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలను ఖండిస్తూ త్రిషకు మద్దతుగా నిలిచారు. మన్సూర్‌ ఇచ్చుకున్న వివరణ సరిపోదని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇక సీనియర్‌ హీరోయిన్‌, బీజేపీ (BJP) నాయకురాలు కుష్భూ (Kushbu) అయితే ఏకంగా మహిళా కమీషన్‌ నుంచి కేసు కూడా నమోదు చేయించింది. మన తెలుగు ఇండస్ట్రీ(TFI) నుంచి ఇప్పటికే హీరో నితిన్‌ (Nitin) ఈ వివాదంపై స్పందించారు. త్రిషకు మద్దతుగా నిలిచారు. లేటెస్ట్‌గా మెగాస్టార్‌ చిరంజీవి (Megastar Chiranjeegvi) కూడా ఈ ఎపిసోడ్‌పై ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ' త్రిష గురించి నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక ఆర్టిస్ట్ కి మాత్రమే కాదు ఏ మహిళను ఉద్దేశించిన అనడానికి కూడా అసహ్యంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాలి. వక్రబుద్ధితో ఇలాంటివి మాట్లాడుతున్నారు. త్రిషకు మాత్రమే కాదు, ఇలాంటి వ్యాఖ్యలు ఏ అమ్మాయికి వచ్చినా నేను అండగా, మద్దుతుగా నిలబడతాను ' అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. స్టాలిన్‌ (Stalin)సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటించిన విషయం తెలిసిందే.

లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraju) దర్శకత్వంలో వచ్చిన లియో(LEO) సినిమాలో విజయ్‌ (Vijay)-త్రిష హీరోహీరోయిన్లుగా నటించారు. ఇందులో మన్సూర్‌ అలీఖాన్‌ ఓ పాత్ర పోషించాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మన్సూర్‌ అలీఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో నేను ఎన్నో రేప్‌ సీన్లలో నటించాను. లియో సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో కూడా రేప్‌ సీన్‌ ఉంటుందని అనుకున్నాను. కాకపోతే.. నాకు అలాంటి సన్నివేశం లేదు. అందుకు బాధగా ఉంది’ అని కామెంట్‌ చేశాడు. ఈ వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. చాలా మంది మన్సూర్‌ను తిట్టిపోశారు. దాంతో మన్సూర్‌ వివరణ ఇచ్చుకున్నాడు. తనకు త్రిషపై చాలా గౌరవం ఉందని.. సరదాగా మాట్లాడిన మాటలు..కొంతమంది కావాలనే వివాదస్పదం చేశారని అన్నాడు. అయినప్పటికీ ఆ దుమారం ఇంకా ఆగలేదు.

Updated On 21 Nov 2023 1:18 AM GMT
Ehatv

Ehatv

Next Story