ఇప్పుడీ వార్త చదవితే అర్జెంటుగా గూగుల్‌లో సెర్చ్‌ చేసి ఆ కంపెనీ అడ్రస్‌ పట్టుకుని అక్కడికి వెళ్లిపోతారు.. అంత గొప్పదా ఆ కంపెనీ అంటే గొప్పదే మరి! గొప్పది కాకపోతే తన ఉద్యోగికి ఏకంగా 365 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తుందా చెప్పండి... ఏడాది పాటు ఆ ఉద్యోగి ఎలాంటి డ్యూటీ చేయకుండా నెలనెలా జీతం పొందవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.. చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌ రాష్ట్రంలో షెన్‌జెన్‌ అనే పట్టణం ఉంది.

ఇప్పుడీ వార్త చదవితే అర్జెంటుగా గూగుల్‌లో సెర్చ్‌ చేసి ఆ కంపెనీ అడ్రస్‌ పట్టుకుని అక్కడికి వెళ్లిపోతారు.. అంత గొప్పదా ఆ కంపెనీ అంటే గొప్పదే మరి! గొప్పది కాకపోతే తన ఉద్యోగికి ఏకంగా 365 రోజులు వేతనంతో కూడిన సెలవులు ఇస్తుందా చెప్పండి... ఏడాది పాటు ఆ ఉద్యోగి ఎలాంటి డ్యూటీ చేయకుండా నెలనెలా జీతం పొందవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.. చైనా(China)లోని గ్వాంగ్‌డాంగ్‌(Guangdong) రాష్ట్రంలో షెన్‌జెన్‌(Shenzhen) అనే పట్టణం ఉంది. అక్కడ ఓ కంపెనీ ఉంది. ప్రతీ ఏడాది వార్షిక విందును ఏర్పాటు చేస్తుందా కంపెనీ. కరోనా కారణంగా మూడేళ్లపాటు వీటిని నిర్వహించలేదు. మొన్నే ఘనంగా ఉద్యోగుల కోసం వార్షిక విందును ఏర్పాటు చేసింది. తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి కాసింత ఉపశమనం కలిగించడానికి సరదా కార్యక్రమాలను నిర్వహించింది. అందులో భాగంగా ఓ లక్కీ డ్రా(Lucky Draw)ను కూడా పెట్టింది.

గాజు కుండీలో కొన్ని చిట్టీలు రాసి డ్రాను ఉద్యోగులతోనే తీయించింది. అందులో అధిక వేతనం, పెనాల్టీలు, ఇతర గిఫ్టులతో పాటు ఏడాది పాటు జీతంతో కూడిన సెలవులు ఇచ్చేలా చిట్టీలు రాసి పెట్టింది. మేనేజర్‌ స్థాయిలో ఉన్న ఓ ఉద్యోగి బంపర్‌ ప్రైజ్‌ కొట్టాడు. డ్రాలో అతడు తీసిన చీటిలో ఏడాదిపాటు జీతంతో కూడిన సెలవులను బహుమతిగా గెల్చుకున్నాడు. అతడే తన సెలవులను ఉపయోగించుకోవచ్చు .లేదా నగదుగా మార్చుకోవచ్చు. అతగాడికి ఇంతకు మించిన ఆనందం మరేముంటుంది చెప్పండి? కంపెనీ చెక్కుతో అతడు దిగిన ఫోటోలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది చూసి కొందరు కుళ్లుకుంటున్నారు. తమ కంపెనీల్లో కూడా ఇలాంటి డ్రాను నిర్వహిస్తే ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నారు. కొందరేమో ఆ కంపెనీలో ఖాళీలున్నాయా? అని ఆరా తీస్తున్నారు. ఇంకొందరు అబ్బే ఇది నమ్మశక్యంగా లేదని చెబుతున్నారు. చైనాలో ఇలాంటివి అసాధ్యమని, ఏడాది తర్వాత అతడు తిరిగి వస్తే అతడి స్థానంలో మరొకడు ఉంటాడని అంటున్నారు.

Updated On 15 April 2023 4:07 AM GMT
Ehatv

Ehatv

Next Story