Joke Cost 17 Crores : ఆ జోకు ఖరీదు 17 కోట్ల రూపాయలు
హాస్యం(Humor) కూడా హద్దులు దాటితే ఏడ్వాల్సిన పరిస్థితి వస్తుంది. చైనాలో(China) హవోషి(Haoshi) అనే స్టాండప్ కమెడియన్‌కు(Stand up comedian) ఇదే జరిగింది. బీజింగ్‌లోని సెంచరీ థియేటర్‌లో మొన్నామధ్య నిర్వహించిన ఓ కార్యక్రమంలో హవోషి ప్రదర్శన ఇచ్చాడు. జోకులు వేస్తూ ప్రేక్షకులను తెగ నవ్వించాడు. అలా జోకుల కార్యక్రమం సాగుతూ ఉన్నప్పుడు వీధి కుక్కలపై ఓ జోకేశాడు
హాస్యం(Humor) కూడా హద్దులు దాటితే ఏడ్వాల్సిన పరిస్థితి వస్తుంది. చైనాలో(China) హవోషి(Haoshi) అనే స్టాండప్ కమెడియన్‌కు(Stand up comedian) ఇదే జరిగింది. బీజింగ్‌లోని సెంచరీ థియేటర్‌లో మొన్నామధ్య నిర్వహించిన ఓ కార్యక్రమంలో హవోషి ప్రదర్శన ఇచ్చాడు. జోకులు వేస్తూ ప్రేక్షకులను తెగ నవ్వించాడు. అలా జోకుల కార్యక్రమం సాగుతూ ఉన్నప్పుడు వీధి కుక్కలపై ఓ జోకేశాడు. తాను షాంఘైకు వెళ్లిన సమయంలో వీధి కుక్కలను దత్తత తీసుకున్న వైనాన్ని ప్రేక్షకులకు చెబుతూ చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ చెప్పే ఓ నినాదంతో పోల్చుతూ జోక్ చెప్పాడు. ప్రేక్షకులు కూడా తెగ నవ్వేశారు. షో పూర్తయిన తర్వాత ఎక్కడివారు అక్కడికి వెళ్లిపోయారు.
ఆ తర్వాత అసలు కథ మొదలయ్యింది. హవోషి చెప్పిన జోక్ చైనాలోని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ జోకుపై అభ్యంతరాలు వెల్లువెత్తాయి. నెటిజన్లు తిట్టడం మొదలుపెట్టారు. అటు తిరిగి ఇటు తిరిగి ఆ జోకు చైనా అధికారుల దృష్టికి వెళ్లింది. ఆ కమెడియన్ మీద వారికి పీకల్దాక కోపం వచ్చింది. సదరు కమెడియన్ కూడా చేసిన పొరపాటేమిటో తెలిసింది. ఇక లాభం లేదనుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. అప్పటికే కాసింత ఆలస్యమయ్యింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అతడు రెప్రసెంట్ చేస్తున్న సంస్థ అతడి కార్యక్రమాలను రద్దు చేసింది. హవోషి వేసిన జోక్ సైన్యాన్ని అవమానించేట్టుగా ఉందని చైనా సాంస్కృతిక శాఖ మండిపడింది. సదరు కంపెనీపై 14.7 మిలియన్ యువాన్ల జరిమానా విధించింది. మన కరెన్సీలో చెప్పాలంటే ఇంచుమించు 17 కోట్ల రూపాయలు.. జరిగింది తల్చుకుని కమెడియన్ ఇప్పుడు ఏడుస్తున్నాడు.