ప్రస్తుత ఆధునిక సమాజంలో జరుగుతున్న పోకడలు భారతీయ సంప్రదాయాలని బ్రష్టుపట్టిస్తున్నాయనేది కొందరి వాదన .యువత పెడదారుతోక్కుతున్నారు అని విచ్చలవిడి సంస్కృతికి అలవాటు పడుతున్నారు అనేది కొంతమంది వాదన . ముఖ్యంగా నేటి సమాజం లో చాల మంది యువత పెళ్ళికి ముందే కలిసి సహజీవనం కొనసాగిస్తున్నారు . ఇది తప్పు అని చాలామంది వాదించిన యువత మాత్రం తప్పు కాదు భాగస్వామిని ఎంచుకొనేవిధానం లో స్వేచ్ఛ అనేది తప్పు కాదు అనేది వారి వాదన . పెళ్ళికి […]

ప్రస్తుత ఆధునిక సమాజంలో జరుగుతున్న పోకడలు భారతీయ సంప్రదాయాలని బ్రష్టుపట్టిస్తున్నాయనేది కొందరి వాదన .యువత పెడదారుతోక్కుతున్నారు అని విచ్చలవిడి సంస్కృతికి అలవాటు పడుతున్నారు అనేది కొంతమంది వాదన . ముఖ్యంగా నేటి సమాజం లో చాల మంది యువత పెళ్ళికి ముందే కలిసి సహజీవనం కొనసాగిస్తున్నారు . ఇది తప్పు అని చాలామంది వాదించిన యువత మాత్రం తప్పు కాదు భాగస్వామిని ఎంచుకొనేవిధానం లో స్వేచ్ఛ అనేది తప్పు కాదు అనేది వారి వాదన . పెళ్ళికి ముందు సహజీవనం ,శృంగారం, ఇవన్నీ పాశ్చత్య సంప్రదాయాలు గా భావిస్తారు . కానీ మన దేశం లో ఒక రాష్ట్రము లో నివసించే గిరిజన ప్రజలకు ఒక వింత ఆచారం ఉంది . ఇక్కడ పెళ్ళికి ముందే నచ్చిన అమ్మాయితో కలిసి గడపచ్చు ఆ తర్వాత కొన్ని రోజులకి నచ్చితే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు .

ఛత్తీస్గఢ్ రాష్ట్రము లో నక్సల్స్ ప్రాంతమైన బస్తర్ జిల్లాలో గోండు అనే మారుమూల పల్లెలో కొనసాగుతున్న వింత ఆచారమే ఇది. ఇక్కడ పెళ్ళికి ముందు ఇష్టమైన వారితో శృంగారం చేయచ్చు . ఎంతకాలమైనా వారితో కలిసి తిరిగచ్చు .ఇదంతా అక్కడి ప్రజల ముందే జరుగుతుంది . కొన్నాళ్లకి వారిద్దరికీ ఒప్పదం కుదిరితే పెద్దల సమక్షం లో పెళ్లి చేస్తారు. ఏ క్రమంలో చాల మంది గర్భం దాలుస్తారు. ఆ గర్భం తో నీ పెళ్లి పీటలు ఎక్కుతారు ఇక్కడ జనం .వినడానికి వింతగా ఉన్న అది వారి ఆచారం అంటున్నారు అక్కడి ప్రజలు .

వెదురుబొంగులతో నిర్మించే ప్రత్యేకమైన కట్టడాల్లో ఈ జంటలు నివసిస్తారు . ఇలా కలిసి జీవించాలని అనుకునేవాళ్లకి నివాసం ఉండే ఈ తతంగాన్ని ఇక్కడ ప్రజలు ఘోతుల్ అనే సంప్రదాయం గా భావిస్తారు. ఇక్కడ అబ్బాయిలు నచ్చిన అమ్మాయిలకు వెదురు దువ్వెనలను గిఫ్ట్ గా ఇస్తూ ఉంటారు . ఆ దువ్వెనలు అమ్మాయిలు తలలో ధరిస్తారు ఆలా వారి ఇష్టాన్ని కూడా అబ్బాయికి తెలియజేస్తారు. వారు శారీకంగా కూడా తమ బంధాన్ని కొనసాగిస్తారు. కొన్ని రోజులకి తరవాత కూడా ఇష్టం ఉంటే పెళ్లి చేస్తారు. ఆలా అమ్మాయి అబ్బాయి ఇచ్చిన దువ్వెన తలనుండి తీసేసి తిరిగితే ఆ అమ్మాయికి అబ్బాయి నచ్చలేదు అని అర్ధం . అక్కడ 10 ఏళ్ళు వయసు నుండి ఉన్నవారంతా ఈ ఘోతుల్ సంప్రదాయాన్ని పాటిస్తారు. ఎవరు ఇక్కడ అభ్యంతరం చెప్పరు .ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కలిపి నృత్యాలు చేస్తూ పాటలు పాడుకుంటారు .

ఎవ్వరి ఒత్తిడి కానీ బలవంతం కానీ వీరికి పెళ్లి విషయం లో ఉండవు. ఎలాంటి లైంగిక దాడులు ఇక్కడ జరగవు. ఇలాంటి విషయాల్లో ఇక్కడ ఎలాంటి కేసులు నమోదు కాలేదు ఇప్పటి వరకు .

Updated On 27 Feb 2023 8:12 AM GMT
Ehatv

Ehatv

Next Story