Beer Bus in Chennai : బీర్ బస్సులోచెన్నై నుండి పాండిచ్చేరి ఒక్క రోజు హాలిడే ట్రిప్..!
చెన్నై (Chennai)నుండి పుదుచ్చేరికి (Puducherry)ఒక రోజు ట్రిప్ అలాగే తిరుగు ప్రయాణం కోసం కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం కానుంది. ఇందులో విశేషమేమిటంటే, ఈ బస్సు పేరు బీర్ బస్.(Beer Bus). ఈ బస్సు కి ఆ పేరు పెట్టారు కదా అని బస్సు లో మద్యానికి అనుమతి ఉందని అనుకోవద్దు ఒక్క రోజులో ఫ్యామిలీతో హాయిగా ట్రిప్ వేయాలి అనుకునేవాళ్ళకి ఈ బస్సు ప్రయాణం క్రేజీ గా ఉండబోతుంది .
చెన్నై (Chennai)నుండి పుదుచ్చేరికి (Puducherry)ఒక రోజు ట్రిప్ అలాగే తిరుగు ప్రయాణం కోసం కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం కానుంది. ఇందులో విశేషమేమిటంటే, ఈ బస్సు పేరు బీర్ బస్.(Beer Bus). ఈ బస్సు కి ఆ పేరు పెట్టారు కదా అని బస్సు లో మద్యానికి అనుమతి ఉందని అనుకోవద్దు ఒక్క రోజులో ఫ్యామిలీతో హాయిగా ట్రిప్ వేయాలి అనుకునేవాళ్ళకి ఈ బస్సు ప్రయాణం క్రేజీగా ఉండబోతుంది. ఇప్పుడు పుదుచ్చేరి(Puducherry) బీర్ బస్(Beer bus)స్కీమ్ కండిషన్స్ ఈ బస్సు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, ఈ ట్రిప్ ప్యాకేజీ ధర ఎంత అనే విషయాలు తెలుసుకుందాం .
చెన్నైలో(Chennai) నివసిస్తున్న చాలా మందిప్రజలు వీకెండ్ లో ఒకరోజు సరదాగా అలా బీచ్ అందాలను పాండిచ్చేరిని చూడాలని అనుకుంటే మాత్రం ఈ బీర్ బస్సు జర్నీ అసలు మిస్ అవ్వద్దు . వీకెండ్ టూర్ కి వెళ్లే వాళ్ళను దృష్టిలో ఉంచుకొని పుదుచ్చేరికి చెందిన ఓ కంపెనీ కొత్త టూరిజం సర్వీసును అందించాలని నిర్ణయించింది.
పుదుచ్చేరిలో(Puducherry) కాటమరన్ బ్రూయింగ్ కో-పాండీ అనే కంపెనీ పనిచేస్తోంది. ఈ సంస్థ చెన్నై నుండి పుదుచ్చేరికి ‘బీర్ బస్’ (Beer bus)అనే కొత్త టూరిజం ప్రాజెక్ట్‌ను ప్రవేశపెట్టింది.ఈ నెల 22న ఈ బీర్ బస్ సర్వీస్ ప్రారంభం కానుందని ప్రకటించారు. చెన్నై (Chennai)నుంచి పుదుచ్చేరికి ఒక రోజు పర్యటనకు ఒక్కొక్కరికి రూ.3,000 వరకు ఖర్చు అవుతుంది.
ఈ బీర్ బస్‌లో రకరకాల ఫుడ్స్ ఐటమ్స్ తింటూ పుదుచ్చేరి(Puducherry) అందాలను ఆస్వాదించవచ్చు. అదే సమయంలో, బీర్ బస్సు (Beer bus)కాబట్టి బస్సులో ఎవరూ మద్యం తాగలేరు అని గుర్తించుకోండి . వినూత్నంగా ఉండాలని మాత్రమే ఆ పేరుని పెట్టడం జరిగింది . నిజానికి మద్యం బస్సులో అనుమతించబడదు .