ఒక పెంపుడు కుక్క విషయం లో చేయాల్సిన వైద్యానికి సంబంధించి CHATGPT అందించిన సహాయం వివరిస్తూ ట్విట్టర్ లో ఆ విషయాన్నీ గురించి ఈ విధంగా పోస్ట్ చేయటం జరిగింది . AI చాట్‌బాట్ CHATGPT తన కుక్క బాధపడుతున్న వ్యాధి నయం కావటానికి' ఏ విధం గా diagnosis చేయాలి అనేది స్పష్టంగా వివిరించింది .

సాంకేతిక ప్రపంచంలో అద్భుతాలను సృష్టించే దిశగా CHATGPT పరుగులు తీస్తుంది. అన్ని రంగాల్లోCHATGPT సహాయంతో ప్రయోగాలు చేస్తున్నారు నిపుణులు . అయితే సాధారణ వినియోగ దారులు కూడా ఇప్పుడు తమకు కావాల్సిన సమాచారాన్నిHATGPT ద్వారా పొందుతున్నారు. తాజాగా ఒక వెటర్నరీ డాక్టర్ CHATGPT వినియోగించటంలో ఒక ప్రయత్నం చేసారు . ఒక పెంపుడు కుక్క విషయం లో చేయాల్సిన వైద్యానికి సంబంధించి CHATGPT అందించిన సహాయం వివరిస్తూ ట్విట్టర్ లో ఆ విషయాన్నీ గురించి ఈ విధంగా పోస్ట్ చేయటం జరిగింది . AI చాట్‌బాట్ CHATGPT తన కుక్క బాధపడుతున్న వ్యాధి నయం కావటానికి' ఏ విధం గా diagnosis చేయాలి అనేది స్పష్టంగా వివిరించింది .

ఒక పశువైద్యుడు తన పెంపుడు కుక్క కు ఎముకలకు సంబంధించి ఒక అరుదైన వ్యాధి ఉందని తెలుసుకున్నాడు . టిక్-బోర్న్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ మంచిగా ఉండేసరికి మొదట్లో వ్యాధి తీవ్రత తగ్గింది .కానీ అనూహ్యంగా కొన్ని రోజులకి పరిస్థితులు చాలకష్టంగా మారాయి . రక్త పరీక్షలో మరింత తీవ్రమైన రక్తహీనత వెల్లడైంది, ఇది మునుపటి కంటే అధ్వాన్నంగా ఉందని అతను వాపోయాడు .
ఈ విషయం గురించిన సమాచారం కోసం తాను CHATGPT4 ను ఆశ్రయించగా అది తనకు మెరుగైన సమాచారాన్ని ఇవ్వటం ఆ సమాచారం వలన వ్యాధిని ఎలా అదుపు లో కి తీసుకురావాలి అనేది తెలుస్తుంది అని చెప్పారు .

టిక్-బర్న్ వ్యాధులతో సంబంధం ఉన్న ఇతర సహ-ఇన్ఫెక్షన్‌లను కంట్రోల్ చేసే విధానానికి సంబంధించి అన్ని రక్త పరీక్షలను నిర్వహించిన ప్రయోజనం లేకపోయింది . రక్త హీనతకు సంబందించిన అన్ని సమస్యల ను కనుగొనే జాబితాను అడుగగా ఈ విషయాలకు అసలు CHATGPT4 ఎలా సమాధానం ఇచ్చింది అంటే మొదట నేను వెటర్నరీ డాక్టర్ ని మాత్రం కాదు అని స్టార్ట్ చేస్తూ సమాధానాన్ని మొదలుపెట్టింది. 4DX పరీక్ష ఇతర కోఇన్‌ఫెక్షన్‌ల కోసం,అలాగే అల్ట్రాసౌండ్ అంతర్గత రక్తస్రావాన్ని తగ్గించే వైద్య పరీక్ష,వీటి అన్నిటికి కి దీటుగా నిలిచే ఒకే ఒక రోగ నిర్దారణ IMHA,ఒకటి అని చెప్పడం జరిగింది

IMHA Immune-Mediated Hemolytic Anemia, or IMHA రోగనిరోధక-మధ్యవర్తిత్వ హిమోలిటిక్ అనీమియా ఇది సాధారణంగా కుక్కలా శరీరంలో ఉండే రక్తకణాలు పై దా డి చేస్తుంది. (రక్తహీనత) కు దారి తీస్తుంది. దీనికి రక్త మార్పిడి అవసరం . అనేది చివరకు తెలిసింది అని నిర్దారించారు వైద్యుడు ఈవిషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు .

ఏది ఏమైనా CHATGPT3. 5 ప్రయోజనాలకంటే మెరుగైన సేవలను అందించటం లో CHATGPT4 ముందు ఉందంటూ ఈ సంఘటన ను వివరిస్తూ పేర్కొన్నారు .

Updated On 29 March 2023 1:41 AM GMT
rj sanju

rj sanju

Next Story