టెక్నాలజీ రంగంలో అద్భుతాలను సృష్టిస్తూ దూసుకెళ్తుంది ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)ChatGPT విడుదల అయిన 2 నెలల్లోనే 100 కోట్ల మంది యూజర్లు ChatGPTని డౌన్లొడ్ చేసుకున్నారు . ChatGPTని అభివృద్ధి చేసిన శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన Open AI సంస్థ ఇప్పుడు ChatGPT యూజర్స్ కి ఒక బిగ్ ఆఫర్ ప్రకటించింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 లక్షలు గెలుచుకొనే అవకాశాన్ని ఇస్తుంది . దానికోసం ఏమి చేయాలి ChatGPT, వల్ల ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ,ChatGPT తీర్చలేని సమాధానాలను కానీ మీరు వెతికి పట్టుకుంటే మీరు ఆ బహుమతిని గెలుచుకోవచ్చు .

టెక్నాలజీ రంగంలో అద్భుతాలను సృష్టిస్తూ దూసుకెళ్తుంది ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence)ChatGPT,విడుదల అయిన 2 నెలల్లోనే 100 కోట్ల మంది యూజర్లు ChatGPTని డౌన్లొడ్ చేసుకున్నారు . ChatGPTని అభివృద్ధి చేసిన శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన Open AI సంస్థ ఇప్పుడు ChatGPT యూజర్స్ కి ఒక బిగ్ ఆఫర్ ప్రకటించింది . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 లక్షలు గెలుచుకొనే అవకాశాన్ని ఇస్తుంది . దానికోసం ఏమి చేయాలి ChatGPT, వల్ల ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ,ChatGPT తీర్చలేని సమాధానాలను కానీ మీరు వెతికి పట్టుకుంటే మీరు ఆ బహుమతిని గెలుచుకోవచ్చు .

OpenAI సంస్థ బగ్ బౌంటీ ప్రోగ్రామ్(Bug Bounty Program) పేరుతో ఈ కాంటెస్ట్ ని రన్ చేస్తుంది. OpenAI సంస్థ లాంచ్ చేసిన ChatGPT ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది . సాంకేతికంగా ఎలాంటి నష్టాలు రాకుండా ,లోపాలను సరిదిద్దుతూ నిపుణులు ChatGPT పైన ఇప్పటికి పరిశోధనలు జరుపుతున్నారు . OpenAI సంస్థ ఈ ప్లాట్‌ఫామ్‌లో బగ్‌లను గుర్తించి పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా ఈ వినూత్నమైన ప్రోగ్రాం కండక్ట్ చేస్తుంది .వినియోగదారులకు USD 20,000 డాలర్లు బహుమతి ప్రకటించింది .

ఓపెన్ ఏఐ బగ్ బౌంటీ ప్రోగ్రామ్ (Bug Bounty Program) మంగళవారం నుంచి మొదలైంది. మీరు గుర్తించే బగ్ తీవ్రత ని బట్టి ప్రైజ్ మనీ కూడా పెరుగుతుందని కంపెనీ ప్రకటించింది . తక్కువస్థాయి బగ్ లను గుర్తిస్తే రివార్డ్ USD 200 (సుమారు రూ. 16,000)నుండి USD 20,000వరకు రివార్డులను అందించాలని నిర్ణయించింది . కోడర్స్ ,సెక్యూరిటీ పరిశోధకులు ,ఎథికల్ హకెర్స్ వంటి వారిని పాల్గొనవచ్చు అని చెప్పిన ,ప్రపంచంలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు దీంట్లో పాల్గొనవచ్చు .అలాగే సాఫ్ట్ వేర్ దిగ్గజం OpenAI సంస్థ లో భారీ పెట్టుబడుల్ని పెట్టి ప్రోత్సహిస్తుంది . ప్రస్తుతం ChatGPT మీద కొన్ని దేశాల్లో నిషేధం నడుస్తుంది . యూరోప్ ,ఇటలీ వంటి దేశాలు ChatGPT సేవలను వ్యతిరేకిస్తున్నాయి . భద్రత వంటి విషయాల్లో ChatGPT వల్ల నష్టాలు ఏర్పడవచ్చు అని ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక రంగంలో పెను ప్రమాదాలను తెస్తుందని ,వేలాది మంది ఉద్యోగం కోల్పోతారని భావన నడుస్తుంది . ఈ బగ్ బౌంటీ కార్యక్రమంలో ద్వారా తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ (artificial intelligence systems) సెక్యూరిటీ, రిలయబిలిటీ పెరుగుతుందని ఓపెన్ ఏఐ భావిస్తోంది.ఈ నేపధ్యం లో ChatGPTయూజర్ డేటా ని ఎలా డీల్ చేయగలదు . డేటా భద్రత విషయంలో దీని సామర్ధ్యాన్ని ఇంకా పెంచేలా ఈ బగ్ బౌంటీ ప్రోగ్రాం ని తీసుకురావటం జరిగింది .

Updated On 13 April 2023 12:26 AM GMT
rj sanju

rj sanju

Next Story