Sam Altman: బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన చాట్ జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్టన్..!
ఏఐ (AI) చాట్‌బాట్ చాట్ జీపీటీ (Chat GPT) సృష్టికర్త శామ్ ఆల్టన్ (Sam Altman) తన బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్నాడు. స్కూల్‌లో చదువుతున్నప్పుడే తనకు తాను గే (Gay) అని శామ్ ఆల్టన్ ప్రకటించుకున్నాడు. మేజరయిన తర్వాత లూప్ట్ సంస్థ (Loopt) సహ వ్యవస్థాపకుడు నిక్ సివోతో (Nick Sivo) తొమ్మిదేళ్ల పాటు సహజీవనం చేసి 2012లో విడిపోయాడు. తర్వాత ఆస్ట్రేలియాకు చెందిన మల్హెరిన్‌తో (Mulherin) ప్రేమ వ్యవహారాన్ని మొదలు పెట్టాడు. మెల్‌బోర్న్ యూనివర్శిటీలో మల్హెరిన్ చదువుకున్నాడు.

2020-22 మధ్య కాలంలో మెటాలో (Meta) వీరిద్దరు పనిచేశారు. ఈ సందర్భంగా తమ మధ్య బంధాన్ని గుట్టుగా కొనసాగించారు. 2023 సెప్టెంబర్‌లో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ శామ్ ఆల్టన్.. తమ ప్రేమగురించి చెప్పుకున్నాడు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని (San Francisco) ఓ ఇంట్లో ఇద్దరం కలిసే ఉంటున్నామని న్యూయార్క్ (New York) మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత ప్రధాని మోడీ (PM Modi)పర్యటన సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ (Biden) ఇచ్చిన విందుకు తొలిసారి మల్హెరిన్‌తో కలిసి హాజరయ్యారు.
చాట్ జీపీటీ రాకతో ప్రపంచవ్యాప్తంగా శామ్ ఆల్టన్ పేరు పాకిపోయింది. గత ఏడాది శామ్ ఆల్టన్‌ను సీఈవో బాధ్యతల నుంచి ఏఐ తొలగించింది. దీంతో మైక్రోసాఫ్ట్ (MicroSoft) కంపెనీ ఆల్టన్‌ను తమ కంపెనీలోకి తీసుకుంది. ఆ తర్వాత శామ్ ఆల్టన్‌ను మళ్లీ ఏఐ లాగేసుకుంది. ఈ వ్యవహారమంతా ముగిశాక తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అమెరికాలోని హవాయ్ (Hawai) సముద్ర తీరంలో శామ్ ఆల్టన్, మల్హెరిన్‌ను పెళ్లి నిరాడంబరంగా జరిగింది. లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో పలువురు నెటిజన్లు ఈ నూతన జంటకు మ్యారేజ్ విషెస్ చెప్తున్నారు.