Save HCU: HCU వివాదంపై స్పందిస్తున్న ప్రముఖులు..!!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల వివాదం కొనసాగుతుండగా ఈ అంశంపై పలువురు రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు స్పందిస్తున్నారు. సామాజిక అంశాలపై ముందుగా స్పందించే ప్రముఖ నటుడు, రాజకీయ విశ్లేషకుడు ప్రకాష్‌రాజ్ కూడా ఈ వివాదంపై జస్ట్ ఆస్కింగ్‌ పేరుతో ఎక్స్‌లో పోస్టు చేశారు. విద్యాసంస్థలకు కేటాయించిన భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం అన్యాయమని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. ''ఈ విధ్వంసం ఆమోదయోగ్యం కాదు.. ఇది మంచిది కాదు .. ఇలాంటి దారుణమైన చర్యకు వ్యతిరేకంగా నేను విద్యార్థులు మరియు పౌరులకు మద్దతు ఇస్తున్నాను.. మన భవిష్యత్తు కోసం ఈ నిరసనను షేర్ చేసి విస్తృతం చేయాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను'' అని ప్రకష్‌రాజ్‌ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ''ప్రకృతిపై ఈ దుష్ప్రవర్తన ఆపాలి.. తెలంగాణలో పాలిస్తున్న మీ పార్టీ చర్యను మీరు పరిశీలిస్తారా అంటూ రాహుల్‌గాంధీని ఆయన ఎక్స్‌వేదికగా ప్రశ్నించారు. టాలీవుడ్ నటి ఈశా రెబ్బ కూడా ఇన్‌స్టాలో స్పందించారు. సేవ్‌ హెచ్‌సీయూ అంటూ విద్యార్థులు చేస్తున్న ఉద్యమానికి ఆమె మద్దతు పలుకుతూ ఇన్‌స్టాలో స్టేటస్ పెట్టుకున్నారు. మరోవైపు ప్రభుత్వం ఈ ఆరోపణలు ఖండిస్తోంది. ఈ 400 ఎకరాల భూమిలో అంగుళం కూడా యూనివర్సిటీకి చెందింది కాదని.. ఆ స్థలమంతా ప్రభుత్వానిదేనని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తోంది. అయినప్పటికీ విద్యార్థులు, రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సేవ్‌ హెచ్‌సీయూ అనే హ్యాష్‌ ట్యాగ్‌తో విద్యార్థులు ఇన్‌స్టాలో పోస్టులకు విశేష స్పందన వస్తోంది. జాతీయస్థాయిలో ఈ ఉద్యమానికి పలువురు ప్రకృతి ప్రేమికులు దీనిని ఖండిస్తున్నారు

ehatv

ehatv

Next Story