బీర్(Beer) ప్రియులకు చేదు వార్త ..ఇపుడు యువతలో చాలా మందికి బీర్ తీసుకొనే అలవాటు ఉంది. అసలే వేసవి కాలం సాయంకాలం అయ్యిందా చల్లగా ఒక బీర్ వేసి బిర్యానీ తిని పడుకుందాం అనుకునేవాళ్లు చాల మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ల్లు ఇకమీదట కాస్త జాగ్రత్త పడాల్సిందే . బీర్ లో కలిసే ఒక విషపూరితమైన రసాయనం(Chemicals) వలన కాన్సర్ (Cancer)వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు .

బీర్(Beer) ప్రియులకు చేదు వార్త ..ఇపుడు యువతలో చాలా మందికి బీర్ తీసుకొనే అలవాటు ఉంది. అసలే వేసవి కాలం సాయంకాలం అయ్యిందా చల్లగా ఒక బీర్ వేసి బిర్యానీ తిని పడుకుందాం అనుకునేవాళ్లు చాల మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ల్లు ఇకమీదట కాస్త జాగ్రత్త పడాల్సిందే . బీర్ లో కలిసే ఒక విషపూరితమైన రసాయనం(Chemicals) వలన కాన్సర్ (Cancer)వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు . అవును ఇది నిజం . బీర్ ని నిలువకోసం ప్రాసెస్ చేసేవిధానంలో ఉపయోగించే నైట్రోసమైన్‌ల (Nitrosamine )వంటి హానికరమైన రసాయనాలు కలుస్తాయి . నైట్రోసమైన్ చాలా ప్రమాదకరమైన రసాయనం, ఇది ఊపిరితిత్తులు, మెదడు, కాలేయం, మూత్రపిండాలు, గొంతు మరియు కడుపు క్యాన్సర్‌కు కారణమవుతుంది. నైట్రోసమైన్ బీరు లేదా మాంసానికి ఉపయోగించినపుడు , ఇది నైట్రేట్ మరియు ద్వితీయ అమైన్‌ల ప్రతిచర్య ద్వారా ఏర్పడుతుంది.ఇది ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని యూరోపియన్ యూనియన్‌కు (European Union)చెందిన ఆరోగ్య నిపుణులు తెలిపారు.

బీర్ ఇంకా ప్రాసెస్ చేసిన మాంసంలో నైట్రోసమైన్‌ల Nitrosamine వినియోగం భారీగా జరుగుతుందని గుర్తించటం జరిగింది . ప్రాసెస్ చేసే మాంసం నిల్వఉండటానికి అలాగే ఎక్కువ రోజులు తాజాగా కనిపించటానికి ప్రాసెస్ చేసిన మాంసానికి నైట్రేట్స్(nitrate) జోడించబడతాయి, దీనివలన ప్యాకేజీ చేసిన మాంసం ఎక్కువకాలం తాజాగా ఉన్నట్లు కనిపిస్తుంది .ప్రాసెస్ చేసిన చేపలు, కోకో, బీర్, పాలు, తృణధాన్యాలు అలాగే కొన్ని కూరగాయలులతో పాటు ప్రాసెస్ చేసిన మాంసానికి నైట్రేట్స్ని కలుపుతారు ,ఇవి ఎక్కువకాలం నిల్వ ఉండటానికి సహాయపడతాయి .

అన్ని వయసుల వారిపై నైట్రేట్‌ల ప్రభావాన్ని విశ్లేషించగా , నైట్రేట్‌లు అందరి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నిపుణులు వెల్లడించారు .అలాగే ఇప్పటి వరకు మన శరీరం లో పేరుకుపోయిన ఈ హానికరమైన నైట్రేటుల(nitrates) వలన కలిగే ఇబ్బందుల నుండి బయట పడాలి అంటే సమతుల్యమైన ఆహారాన్ని (balanced nutrition)తీసుకోవాలి వైద్యులు చెపుతున్నారు . . ఇతర దేశాలతో పోల్చుకుంటే మన భారత దేశంలో(India) ప్రాసెస్ చేయబడిన ఫుడ్ తినేవారి శాతం అతితక్కువగా ఉంది. కానీ ఈ హానికరమైన నైట్రేట్ రసాయనం బీర్ లో ఎక్కువ ఉండటం ప్రమాదకరం కాబట్టి ఇకనైనా బీర్ తీసుకొనే వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి .

Updated On 12 April 2023 3:17 AM GMT
rj sanju

rj sanju

Next Story