Brides Relatives Beat Groom : అసలే బట్టతల. ఆపై రెండో పెళ్లికి సిద్ధం... విగ్గు ఊడేలా చితకబాదిన పెళ్లి కూతురు బంధువులు
బీహార్‌లో(Bihar) ఓ పెళ్లి కొడుకును(Groom) పెళ్లి కూతురు బంధువులు చితకబాదారు. అందుకు కారణం అంతకు ముందే పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి ఇంకో పెళ్లికి రెడీ అవ్వడం. కొత్వాలి(Kotwali) పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇక్బాల్ నగర్(Iqbal Nagar) ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అదివరకే పెళ్లయింది. కానీ ఆ విషయం దాచిపెట్టి మరో పెళ్లికి సిద్ధపడ్డాడు. అతడికి అంతకు ముందే పెళ్లయిన విషయం సరిగ్గా పెళ్లి రోజే వధువు కుటుంబానికి తెలిసింది.

Brides Relatives Beat Groom
బీహార్‌లో(Bihar) ఓ పెళ్లి కొడుకును(Groom) పెళ్లి కూతురు బంధువులు చితకబాదారు. అందుకు కారణం అంతకు ముందే పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి ఇంకో పెళ్లికి రెడీ అవ్వడం. కొత్వాలి(Kotwali) పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇక్బాల్ నగర్(Iqbal Nagar) ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అదివరకే పెళ్లయింది. కానీ ఆ విషయం దాచిపెట్టి మరో పెళ్లికి సిద్ధపడ్డాడు. అతడికి అంతకు ముందే పెళ్లయిన విషయం సరిగ్గా పెళ్లి రోజే వధువు కుటుంబానికి తెలిసింది. ఇంతలో వరుడు పెళ్లి దుస్తుల్లో చక్కగా ముస్తాబయ్యి మండప దగ్గరకు వచ్చాడు. ఇతడి కోసమే ఎదురుచూస్తున్న పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వరుడితో గొడవకు దిగారు. అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించిన అతడి చెంపలు వాయించారు.
అప్పటికీ కోపం చల్లారకపోవడంతో వేదికపైనే వరుడిని చితకబాదారు. చెంపదెబ్బ(slapped) కొట్టడంతో వరుడి విగ్గు(wig) కాస్తా ఊడి కిందపడింది. బట్టతలను(Baldness) దాచిపెట్టినందుకు పెళ్లికూతురు వాళ్లకు మరింత కోపం వచ్చేసింది. అసలు అతడికి ఉన్నది ఒరిజనల్ జుట్టు కాదని, విగ్గు అని అప్పుడే తెలిసింది. ఇంకో రెండు దెబ్బలేశారు. తప్పయ్యింది మన్నించండి అంటూ పెళ్లి కొడుకు చేతులు జోడించి ప్రాధేయపడినా వీరి కోపం చల్లారలేదు. తనపై జరిగిన దాడిని గ్రామాధికారులకు చెప్పుకున్నాడు వరుడు. గ్రామపెద్దలు పంచాయితీ పెట్టి గొడవ సద్దుమణిగేలా చేశారు. తర్వాత పెళ్లి కొడుకును వెనక్కి పంపించేశారు. గయాలోని దోభి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోవైపు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని దోభీ, కొత్వాలి పోలీస్‌స్టేషన్ అధికారులు తెలిపారు.
