తల్లిదండ్రులు చెప్పినవాడితో తలొంచుకుని తాళికట్టించుకోవడానికి అమ్మాయిలేం సిద్ధంగా లేరిప్పుడు! పెళ్లికొడుకు నచ్చకపోతే నచ్చలేదని డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని కౌశాంబి(Kaushambi)లోనే ఇదే జరిగింది. పెళ్లిమండపంలో వరుడికి పూల దండ వేస్తున్న సమయాన పెళ్లి కూతురు గొప్ప నిర్ణయం తీసుకుంది. కాబోయే భర్తలోని లోపాన్ని ఎత్తి చూపుతూ పెళ్లి వద్దనేసింది.

తల్లిదండ్రులు చెప్పినవాడితో తలొంచుకుని తాళికట్టించుకోవడానికి అమ్మాయిలేం సిద్ధంగా లేరిప్పుడు! పెళ్లికొడుకు నచ్చకపోతే నచ్చలేదని డైరెక్ట్‌గా చెప్పేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని కౌశాంబి(Kaushambi)లోనే ఇదే జరిగింది. పెళ్లిమండపంలో వరుడికి పూల దండ వేస్తున్న సమయాన పెళ్లి కూతురు గొప్ప నిర్ణయం తీసుకుంది. కాబోయే భర్తలోని లోపాన్ని ఎత్తి చూపుతూ పెళ్లి వద్దనేసింది. పూల మాల వేస్తున్నప్పుడు అతనిని పరిశీలనగా చూసింది. దండ వేసేందుకు నిరాకరించింది. పెళ్లి కూతురు నిర్ణయంతో అక్కడున్నవారు దిగ్భ్రాంతి చెందారు. వరుడి రంగు తక్కువగా ఉందని, వయసు మీదపడిన వాడిలా కనిపిస్తున్నాడని చెబుతూ అతడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. వధువు నోటి వెంట ఈ మాటలు రాగానే పెళ్లిమండపంలో కలకలం రేగింది. పెద్దలు అమ్మాయికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు కానీ అమె తన మనసు మార్చుకోలేదు. దాంతో వరుడు ప్లస్‌ అతడి బంధు మిత్ర పరివారం అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన మే 29న పిపరీ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని షేర్‌పురాలో జరిగింది. ఆ ఊరికి చెందిన ఓ యువకుడికి చర్వా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్లి కుదిరింది. మే 29వ తేదీన వరుడు తమ తరపు పెద్దలతో పాటు ఊరేగింపుగా వధువు ఇంటికి వచ్చారు. యధా ప్రకారం పెళ్లికొడుకుకు అమ్మాయి తరపువారంతా ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత వరమాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. వధువు పూలహారంతో పెళ్లి వేదిక మీదకు వచ్చింది. పెళ్లికొడుకును పరిశీలనగా చూసింది. పూలదండ వేయడానికి నిరాకరించింది. అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. కారణం అడిగితే వరుడ రంగు తక్కువగా ఉన్నాడని, వయసు ఎక్కువగా కనిపిస్తున్నదని చెప్పింది. ఆమెకు నచ్చచెప్పడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించారు కానీ ఆమె వారి మాట వినలేదు.

Updated On 5 Jun 2023 1:05 AM GMT
Ehatv

Ehatv

Next Story