✕
Viral video : అత్తారింటికి వెళ్లనే వెళ్లనంటూ వధువు ఏడుపులు... అప్పుడు అన్న ఏం చేశాడంటే...!
By Eha TvPublished on 22 Oct 2024 12:42 PM
పెళ్లయ్యాక అప్పగింతల వేళ అక్కడి వాతావరణం ఉద్వేగ్నభరితంగా మారిపోతుంది.

x
అమ్మాయిని అత్తారింటికి(In laws) పంపేటప్పుడు తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనవుతారు. కన్నీరు పెడతారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు కూడా కన్నీరును బలవంతంగా ఆపుకుంటారు. ఇష్టం ఉన్నా లేకపోయినా అత్తారింటికి బయలుదేరక తప్పదు. అయితే ఇలా అత్తారింటికి పంపుతున్న దృశ్యాలతో కూడిన ఓ వీడియో సోషల్ మీడియాలో(Social mdia) తెగ వైరల్ అవుతోంది. అందులో స్పెషాలిటీ ఏమిటంటే అత్తారింటికి వెళ్లనని పెళ్లికూతురు పెద్దపెట్టున ఏడ్వడం. వెళ్లనంటే వెళ్లనని కేకలు పెడుతుంటే సోదరుడు ఆ వధువును బలవంతంగా ఎత్తుకుని కారులో కూర్చోబెట్టాడు. ఆ సన్నివేశం చూసి బంధువులు, గ్రామస్తులు తెగ ఆశ్చర్యపోయారు. చాలా మంది నవ్వుకున్నారు.

Eha Tv
Next Story