Maternal Uncles Wedding Gift Worth 3.21crore : మేనకోడలి పెళ్లికి మూడు కోట్ల కట్నం, బోల్డన్ని కానుకలు
కట్నం ఇవ్వడమే కాదు, అది పుచ్చుకున్నా చట్ట ప్రకారం నేరమే! చట్టం గట్టిగా లేదుకాబట్టే కట్నం ఇచ్చేవాళ్లు ఇస్తున్నారు. తీసుకునేవాళ్లు మొహమాటం లేకుండా తీసుకుంటున్నారు. పల్లెల్లో ఈ జాడ్యం ఇంకా ఉంది. ఇదో ఘనమైన సంప్రదాయంగా ఫీలవుతుంటారు..
కట్నం ఇవ్వడమే కాదు, అది పుచ్చుకున్నా చట్ట ప్రకారం నేరమే! చట్టం గట్టిగా లేదుకాబట్టే కట్నం ఇచ్చేవాళ్లు ఇస్తున్నారు. తీసుకునేవాళ్లు మొహమాటం లేకుండా తీసుకుంటున్నారు. పల్లెల్లో ఈ జాడ్యం ఇంకా ఉంది. ఇదో ఘనమైన సంప్రదాయంగా ఫీలవుతుంటారు.. కట్నం ఇవ్వకపోతే పరువు మర్యాదలు మంటకలిసిపోతాయని అనుకుంటారు. కొందరైతే అల్లుడిని తమ తాహతుకు మించిన కట్నాలను ఇస్తారు. తర్వాత ఆర్ధిక సమస్యలతో సతమతమవుతారు.
ఈ ఇంట్రోని ఆపేసి నేరుగా స్టోరీలోకి వెళ్లిపోతాను..జనరల్‌గా కూతుళ్లకు కట్నాలు ఎవరిస్తారు? తండ్రులే కదా! కానీ రాజస్తాన్‌లో ముద్దుల మేనకోడలికి ముగ్గురు మేనమాలు కళ్లు చెదిరిపోయేటంత కట్నం ఇచ్చారు. 3.21 కోట్ల రూపాయలను నగదును, పది ఎకరాల వ్యవసాయభూమిని, 30 లక్షల రూపాయలు విలువ చేసే ప్లాటును, 41 తులాల బంగారాన్ని, ఓ మూడు కిలోల వెండిని కానుకగా ఇచ్చారు.
ఇంత పెద్దమొత్తం కట్నం కారణంగా రాజస్తాన్‌లోని నాగౌర్ జిల్లా బుర్డీ గ్రామం ఒక్కసారి వార్తల్లోకి వచ్చేసింది. ఆ ఊరికి చెందిన భన్వర్‌లాల్ గర్వాకు ముగ్గురు కొడుకులు హరేంద్ర, రామేశ్వర్, రాజేంద్ర. ఓ కూతురు. ముగ్గురు బాగా సంపాదించారు. రెండు వేల ఎకరాలకు పైగా భూమిని కలిగి ఉన్న వీరు చెల్లి పెళ్లి ఘనంగా చేశారు. ఆమెకు ఓ కూతురు ఉంది. ఈ మధ్యనే తమ మేనకోడలి పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఈ ముగ్గురు మేనమామలు మేనకోడలి పెళ్లిని ఘనంగా జరిపించడమే కాకుండా ఎవరూ ఊహించనంత కట్నాన్ని సమర్పించుకున్నారు. ఇంతకు ముందు చెప్పలేదు కానీ ఓ ట్రాక్టర్‌ను, మేనకోడలి కోసం ఓ స్కూటీని కూడా ఇచ్చారు. అంతేనా.. పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఓ వెండి నాణాన్ని రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చారు. బుర్డీ గ్రామ ప్రజలు మైరా సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ సంప్రదాయం ప్రకారం మేనకోడలికి మేనమామలే కట్నకానుకలు ఇవ్వాల్సి ఉంటుంది. మేనకోడలికే కాదు మేనకొడుకు పెళ్లి ఖర్చులు కూడా మేనమామలే భరించాల్సి ఉంటుందట. ఇప్పటి వరకు ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున కట్నకానుకలు ఎవరూ ఇవ్వలేదట.