Groom Dowry Demand : బైక్ వద్దు, బుల్లెట్ బండే కావాలి....మగపెళ్లివారి గొంతెమ్మ కోరికలు.. తర్వాత ఏమైంది?
ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) కట్న(Dowry) పిశాచి ఇంకా అమ్మాయిలను పీడించుకుని తింటూనే ఉంది. చట్టాలు గిట్టాలు జాన్తానై అంటూ వరుడు ప్లస్ అతడి తల్లిదండ్రులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు.ఉత్తరప్రదేశ్‌లో రూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌరంగాబాద్‌లో(Naurangabad) ఇలాగే అదనపు కట్నం కోసం పీడించారు మగపెళ్లివారు..
ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) కట్న(Dowry) పిశాచి ఇంకా అమ్మాయిలను పీడించుకుని తింటూనే ఉంది. చట్టాలు గిట్టాలు జాన్తానై అంటూ వరుడు ప్లస్ అతడి తల్లిదండ్రులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు.ఉత్తరప్రదేశ్‌లో రూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని నౌరంగాబాద్‌లో(Naurangabad) ఇలాగే అదనపు కట్నం కోసం పీడించారు మగపెళ్లివారు.. అందుకు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. దేహాత్‌కు ఊరేగింపుగా చ్చిన మగపెళ్లివారు వధువు తండ్రి తమకు బుల్లెట్ బండితో(Bullet Bike) పాటుగా తాము అడిగిన లక్ష రూపాయల అదనపు కట్నం ఇవ్వలేదని వెనుదిరిగారు. అప్పటికే చాలా ఇచ్చిన పెళ్లి కూతురు తండ్రికి కోపం వచ్చేసింది.
వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదులో తన కుమార్తెకు మున్నూ సింగ్ కుమారుడు బాదల్‌తో పెళ్లి నిశ్చయమైందని తెలిపాడు. జూన్ 18న కళ్యాణమండపానికి వరుని తరపు వారంతా వచ్చారన్నాడు. వారికి స్వాగత సత్కారాలను ఘనంగా చేశామన్నారు. సరిగ్గా పెళ్లి తంతు మొదలయ్యే సమయానికి మగ పెళ్లివారు అదనపు కట్న కోసం డిమాండ్ చేశారని అమ్మాయి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. మగపెళ్లివారు ఉన్నట్టుండి ఇలా అడిగేసరికి ఇరువర్గల మధ్య గొడవ జరిగిందన్నారు. వరుడికి ఇంతకు ముందే ఒక బైక్‌ను ఇచ్చామని, అది తనకు వద్దని బుల్లెట్ బండి మాత్రమే కావాలని మంకుపట్టు పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెళ్లి కొడుకు, అతడి తండ్రితో పాటు మరో 50 మందిపై కేసు నమోదు చేశారు.