రాజస్థాన్‌లో(Rajasthan) ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అది కూడా పెళ్లి(Marriage) వేడుకలో! అసలేం జరిగిందంటే పాలీ(Palli) జిల్లాలోని సౌణా గ్రామానికి చెందిన సకారామ్‌ కూతురు మనీషాకు వారి సమీప బంధువైన శ్రవణ్‌కుమార్‌తో(Sharan Kummar) పెళ్లి కుదిరింది

రాజస్థాన్‌లో(Rajasthan) ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అది కూడా పెళ్లి(Marriage) వేడుకలో! అసలేం జరిగిందంటే పాలీ(Palli) జిల్లాలోని సౌణా గ్రామానికి చెందిన సకారామ్‌ కూతురు మనీషాకు వారి సమీప బంధువైన శ్రవణ్‌కుమార్‌తో(Sharan Kummar) పెళ్లి కుదిరింది. వివాహ వేడుకలో భాంగా పెళ్లికొడుకు తరపు బంధుమిత్రులంతా మే 3వ తేదీన సౌణా గ్రామానికి వచ్చారు. వారికి పెళ్లి కూతురు తరపువారి నుంచి ఘనమైన స్వాగత సత్కారాలు లభించాయి. మరుసటి రోజు అంటే 4వ తేదీ ఉదయం పెళ్లి. పెళ్లి మంటపానికి పెళ్లి కొడుకు వచ్చేశాడు.

పెళ్లి కూతురు(Bride) రావాల్సి ఉంది. త్వరగా వధువును తీసుకురావాలని పురోహితుడు చెప్పారు. కాసేపట్లో వచ్చేస్తుంది. వెయిట్‌ చేయండి అని పెళ్లికూతురు తరపు వారు చెప్పారు. గంటయ్యింది. రెండు గంటలయ్యింది. మూడు గంటలయ్యింది.. పెళ్లి కూతురు జాడలేదు. అంతకు ముందే పెళ్లి కూతురు తనకు విపరీతమైన కడుపునొప్పి వస్తున్నదని చెప్పి ఇంటి వెనుకవైపుకు వెళ్లింది. అక్కడే ఉన్న తన మామ కొడుకు భరత్‌కుమార్‌తో పరారయ్యింది. ఎంతసేపయినా పెళ్లికూతురు రాకపోయేసరికి బంధువులు హడలిపోయారు. కాసేపయ్యాక పెళ్లికూతురు తండ్రి అసలు విషయం చెప్పాడు. కడుపు నొప్పి అని చెప్పి టాయిలెట్‌కు వెళ్లిన తన కూతురు భరత్‌కుమార్‌తో బయటకు వెళ్లిందన్నాడు.

బంధువులు వెళ్లి మనీషాను బతిమాలారు. వారు ఎంత నచ్చచెప్పినా అసలు వినలేదు. పెళ్లికి ఒప్పుకోలేదు. 13 రోజుల పాటు ఇలాగే మొండికేసింది. మరోవైపు వరుడు మాత్రం మనీషా కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఆమె మీద అమితమైన ప్రేమ ఉండబట్టే పెళ్లి అలంకరణలో భాగంగా పెట్టుకున్న పగడీని కూడా తీయకుండా అలాగే ఉన్నాడు. పెళ్లి మండపాన్ని కూడా అలంకరణతోనే ఉంచాడు. ఎప్పటికైనా మనీషా తిరిగి వస్తుందన్న నమ్మకం అతడిది! అతడి నమ్మకం వమ్ము కాలేదు. ఎట్టకేలకు ఆమె పెళ్లికి ఒప్పుకుంది. దాంతో ఆమెకు మే 15వ తేదీన పెళ్లి మండపానికి తీసుకొచ్చారు బంధువులు. మే 16వ తేదీన మనీషా-శ్రవణ్‌కుమార్‌ వివాహం వైభవంగా జరిగింది. బంధుమిత్రులంతా హప్పీగా భోజనాలు చేశారు. కథకు శుభం కార్డు పడింది.

Updated On 29 May 2023 3:44 AM GMT
Ehatv

Ehatv

Next Story