చూస్తూ చూస్తూ తాగుబోతును ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకుంటుందా? చేసుకోదు కదా! ఈ పనే చేసింది ఉత్తరప్రదేశ్‌కు(Uttar Pradesh) చెందిన వధువు. పీటల వరకు వచ్చిన పెళ్లిని వద్దు పొమ్మనేసింది. బంధువులు ఎంత చెప్పినా వినలేదు.

చూస్తూ చూస్తూ తాగుబోతును ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకుంటుందా? చేసుకోదు కదా! ఈ పనే చేసింది ఉత్తరప్రదేశ్‌కు(Uttar Pradesh) చెందిన వధువు. పీటల వరకు వచ్చిన పెళ్లిని వద్దు పొమ్మనేసింది. బంధువులు ఎంత చెప్పినా వినలేదు. వారణాసి(Varanasi) జిల్లాలో చౌబేపుర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి జన్సా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మరో గ్రామానికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. అంతా సజావుగా సాగితే ఆదివారం రాత్రి వీరి పెళ్లి అయిపోవాలి. ఆ రోజు సాయంత్రం బంధుమిత్రుల సపరివారంగా వరుడు(Groom) ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకున్నాడు. కాసేపయ్యారు వధూవరులు వేదికపైకి వచ్చారు. పెళ్లి తంతు మొదలయ్యింది.

వధూవరులు పూలదండలు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే పూర్తిగా మద్యం మత్తులో ఉన్న వరుడి ఫ్రెండ్స్‌ పెళ్లి కూతురు ఫ్రెండ్స్‌ను చూసి కేకలు వేశారు. ఈలలు వేశారు. నానా గోల చేశారు. స్టేజ్‌పై ఉన్న వారికి పట్టరాని కోపం వచ్చింది. పోనీ వరుడు ఆపే ప్రయత్నం చేశాడా? అంటే అదీ లేదు. అతడు కూడా వింత పనులు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. వరుడి మెడలో పూలమాల వేయబోతూ చటుక్కుమని ఆగిపోయింది వధువు. అందుకు కారణం అతడు కూడా ఫుల్లుగా తాగి ఉండటమే! పెళ్లికూతురు కోపంతో స్టేజి దిగి తన గదిలోకి వెళ్లిపోయింది. ఈ పెళ్లి చేసుకోనంటే చేసుకోను అని కరాఖండిగా చెప్పేసింది. కుటుంబ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆ యువతి వినలేదు. వరుడి బంధువులు వచ్చిన దారిలోనే వెళ్లిపోయారు. పెళ్లి కాన్సల్‌ అయ్యింది.

Updated On 23 May 2023 6:30 AM GMT
Ehatv

Ehatv

Next Story