Smart Robos : ఆఖరికి ఆ పని కూడా రోబోలే చేస్తే ఇక మనిషెందుకు.?
కొన్నాళ్లుపోతే మనిషి చేయడానికి ఏ పనీ ఉండదేమో! ఏంచేతంటే ఇప్పుడు సగానికి సగం పనులు రోబోలే చేస్తున్నాయాయే! ఆటోమేషన్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబెటిక్స్ వంటి వాటి కారణంగా భవిష్యత్తులో మన అవసరం లేని వ్యవస్థల రూపకల్పన చాలా వేగంగా జరుగుతోంది. భవన నిర్మాణ రంగంలో కూడా రోబోలు వచ్చేశాయి. ఓ నిర్మాణ కార్మికుడికి ఓ రోబో టూల్స్ అందిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక స్ట్రక్చర్ పైన పని […]
కొన్నాళ్లుపోతే మనిషి చేయడానికి ఏ పనీ ఉండదేమో! ఏంచేతంటే ఇప్పుడు సగానికి సగం పనులు రోబోలే చేస్తున్నాయాయే! ఆటోమేషన్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబెటిక్స్ వంటి వాటి కారణంగా భవిష్యత్తులో మన అవసరం లేని వ్యవస్థల రూపకల్పన చాలా వేగంగా జరుగుతోంది. భవన నిర్మాణ రంగంలో కూడా రోబోలు వచ్చేశాయి. ఓ నిర్మాణ కార్మికుడికి ఓ రోబో టూల్స్ అందిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒక స్ట్రక్చర్ పైన పని చేస్తున్న వ్యక్తికి టూల్స్ బ్యాగ్‌ని అందిచడానికి ఆ రోబో తన మార్గంలో ఉన్న అడ్డంకులు అన్నింటిని దాటుకుని వెళుతున్న దృశ్యం చూడముచ్చటగానే ఉంది. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కూడా దీనిపై కామెంట్ చేశారు.
బోస్టన్ డైనమిక్స్ సృష్టించిన అట్లాస్ అనే రోబోట్ కు సంబంధించిన వీడియోను ఎంటర్‌ప్రైజ్ క్లౌడ్ కంపెనీ బాక్స్ సీఈఓ ఆరోన్ లెవీ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే 18 మిలియన్లమందికి పైగా చూశారు. వేలమంది లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఎలాన్ మస్క్ కూడా దీనిని షేర్ చేస్తూ స్వీట్ డ్రీమ్స్ అని కోట్ పెట్టారు. కల మంచిదే కావచ్చు కానీ.. భవిష్యత్తులో మనిషి చేయడానికి ఏ పని ఉండకపోతే పొట్ట గడవడం ఎలా?