Hema Malini Travels In Mumbai Metro : బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని మెట్రో ప్రయాణం, ముంబయ్ ట్రాఫిక్ భరించలేక..
ముంబయ్(Mumbai) లో ట్రాఫిక్ భారీగా పెరిగింది.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా.. అందరిని ఇబ్బంది పెడుతుంది.. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్(Bollywood Dream Girl).. సీనియర్ హీరోయిన్ హేమా మాలిని(Hema Malini) మెట్రో ప్రయాణం. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్... డ్రీమ్ గర్ల్ హేమా మాలినీ.. మెట్రో ప్రయాణం చేశారు. ముంబయ్ లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో.. విసిగిపోయిన.. సీనియర్ స్టార్.. మెట్రోతో పాటు.. ఆటోలో తన గమ్య స్థానం చేరారు. ఇంట్లో లగ్జరీ కార్లు ఉన్నా.. ఆమె సాధారణ మహిళ మాదిరిగా మెట్రో ఎక్కడంతో అక్కడ ప్రయాణికులు అంతా అవాక్కయ్యారు.
ముంబయ్(Mumbai) లో ట్రాఫిక్ భారీగా పెరిగింది.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా.. అందరిని ఇబ్బంది పెడుతుంది.. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్(Bollywood Dream Girl).. సీనియర్ హీరోయిన్ హేమా మాలిని(Hema Malini) మెట్రో ప్రయాణం.
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్... డ్రీమ్ గర్ల్ హేమా మాలినీ.. మెట్రో ప్రయాణం(Metro Journey) చేశారు. ముంబయ్ లో ట్రాఫిక్(Mumbai Traffic) ఎక్కువగా ఉండటంతో.. విసిగిపోయిన.. సీనియర్ స్టార్.. మెట్రోతో పాటు.. ఆటోలో తన గమ్య స్థానం చేరారు. ఇంట్లో లగ్జరీ కార్లు ఉన్నా.. ఆమె సాధారణ మహిళ మాదిరిగా మెట్రో ఎక్కడంతో అక్కడ ప్రయాణికులు అంతా అవాక్కయ్యారు. హేమా మాలినితో ఫోటోలు తీసుకోవడం కోసం పోటీపడ్డారు. ఆమె కూడా విస్సుకోకుండా అందరికి అభివాదం చేసి.. అడిగిన వారితో ఫోటోలు దిగారు.
ఈ సందర్భంగా మెట్రో, ఆటోలో జర్నీ గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు హేమా మాలిని. అంతే కాదు తన అనుభవాలు ఈ పోస్ట్ లో రాసుకొచ్చారు. ఇంతకీ అసలు ఆమె ఎందుకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఉపయోగిచారంటేు..? హేమ మాలిని మంగళవారం ఉదయం ముంబయి శివారులో దహిసర్‌కు వెళ్లారు. అయితే సిటీ అవతల ఉన్నఈ ప్రాంతానికి తన ఇంటి నుంచి కారులో ప్రయాణించగా దాదాపు రెండు గంటల సమయం పట్టింది. అంత సేపు ప్రయాణం చేయడంతో హేమ బాగా అలసిపోయారు. దాంతో త్వరగా తాను ఇంటికి చేరుకోవడం కోసం మెట్రోను ఉపయోగించారు.
దహిసర్ నుంచి సాయంత్రం సమయంలో ఆమె తిరిగి వచ్చేందుకు కారుకు బదులుగా మెట్రోలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు. చొక్కా, తెల్లటి ప్యాంటు, గోధుమ రంగు బూట్లు ధరించి చేతితో నల్లని బ్యాగుతో మెట్రోలో దర్శనమిచ్చిన సీనియర్ నటిని చూసి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆమెతో ఫొటోలు దిగారు. మెట్రోయానం గురించి వివరిస్తూ వివరించారు. కారులో దహిసర్చేరుకోవడానికి తనకు రెండు గంటల సమయం పట్టిందని, దాంతో అలసిపోయాయని తెలిపారు.
ప్రస్తుతం ఆమె మెట్రోతో పాటు.. ఆటోలో ప్రయాణించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు గతంలో కూడా చాలా మంది సెలబ్రీటు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను ఉపయోగించి వైరల్ న్యూస్ అయ్యారు. ప్రజలతో కలిసి పోయి మాట్లాడుతూ ప్రయాణం చేసిన వారు బాలీవుడ్ తో పాటు... టాలీవుడ్ లో కూడా ఉన్నారు.
After my metro experience, decided to go by auto from DN Nagar to Juhu & that too was fulfilled. Landed by auto at my house & the dazed security could not believe their eyes! All in all, a wonderful, pleasurable experience for me!
In the metro with the public👇 pic.twitter.com/Whr7mOIRM8— Hema Malini (@dreamgirlhema) April 11, 2023